Tilak Varma Breaks Rishabh Pant’s Record after hits Half Century: టీమిండియా యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో వెస్టిండీస్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో తిలక్ ఈ రికార్డు నెలకొల్పాడు. తెలుగు ఆటగాడు తిలక్ రెండో టీ20లో 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు బద్దలు కొట్టాడు.
20 ఏళ్ల 271 రోజుల వయస్సులో తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 21 ఏళ్ల 38 రోజుల వయస్సులో ఈ రికార్డును సాధించాడు. దాంతో పంత్ రికార్డును తిలక్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్ర స్ధానంలో ఉన్నాడు. రోహిత్ ఈ ఘనతను 20 ఏళ్ల 143 రోజుల వయస్సులో నమోదు చేశాడు. ఈ అరుదైన ఫీట్‌ను తిలక్ తృటిలో మిస్ అయ్యాడు. ఐపీఎల్‌లో దరగొట్టిన తిలక్ టీ20 అరంగేట్రం లేట్ అయిన విషయం తెలిసిందే.
తిలక్ వర్మ తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ వెస్టిండీస్‌పై టీ20ల్లో చెలరేగుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న తిలక్.. 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌దే అత్యధిక స్కోర్ కావడం విశేషం. రెండో టీ20లో కూడా అదే తరహా ప్రదర్శన చేశాడు. 41 బంతులు ఎదుర్కొన్న తిలక్ 51 పరుగులు చేశాడు. రానున్న మూడు టీ20లలో కూడా రాణిస్తే.. పొట్టి ఫార్మాట్లో తన స్థానం నిలబెట్టుకోవడం ఖాయం.
Also Read: Bipasha Basu: ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించా.. వైరల్ అవుతోన్న బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు వీడియో!
Ist t20i half Century For Tilak Varma 🔥. pic.twitter.com/eZUdg2IN41
— MOHIT SHUKLA (@MohitShukla1030) August 6, 2023