Site icon NTV Telugu

Tiger : హైదరాబాద్ పరిసరాల్లో పులి సంచారం

Tiger

Tiger

అడవుల్లో ఉండాల్సిన పులులు, చిరుతలు జానరణ్యంలోకి వస్తున్నాయి. వచ్చి మూగజీవాలపై దాడులు చేస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలోని సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. బౌరంపేట రింగురోడ్డు వద్ద పులి సంచారం కలకలం రేపడంతో రెండున్నర నిమిషాల పాటుగా వీడియోలో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి.

Also Read : Keerthy Suresh: కీర్తి పెళ్ళెప్పుడు అంటే.. ఆ రేంజ్ లో సమాధానమిచ్చిందేంటి

హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలోని బౌరంపేట ఔటర్ రింగు రోడ్డు వద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. రెండున్నర నిమిషాల పాటుగా వీడియోలో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. సమాచారం అందుకున్న సురారాం ఫారెస్ట్ సెక్షన్ అధికారి, బీట్ అధికారులు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. పులి పాదముద్రల ఆనవాళ్లను అటవిశాఖ అధికారులు సేకరించారు.

Also Read : SCO Foreign Ministers Meeting: వచ్చే నెలలో భారత్ రానున్న పాక్ మంత్రి.. 2014 తర్వాత ఇదే మొదటిసారి..

పులి సంచరిస్తున్న వార్తతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే స్థానికులు చెబుతున్న వర్షన్.. ఫారెస్ట్ అధికారులు చెబుతున్న వర్షన్ కి చాలా తేడా ఉంది. గడిచిన కొద్ది రోజులుగా పులి సంచారిస్తుందని స్థానికులు చెబుతున్నారు.. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. తాము స్వయంగా పులి సంచరిస్తున్న ఆనవాళ్లు చూసినట్టుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. పులి సంచరిస్తున్నట్లుగా సీసీటీవి ఫుటేజ్ ఆనవాళ్లు ఉన్నాయి. కానీ అటవి శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పులి పాదముద్రల ఆనవాళ్లు సేకరించారు. పులి సంచరిస్తుడంటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Exit mobile version