సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3.. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.. దీపావళి కానుకగా నవంబర్ 12 న విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు తొలి మూడు రోజులు ఫర్వాలేదనిపించిన కానీ నాలుగో రోజు ఏకంగా 45 శాతం పతనమయ్యాయి.నిన్న ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ కలెక్షన్లపై ప్రభావం చూపింది.. ఈ మ్యాచ్ సందర్భంగా దేశమంతా టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయింది. దీనితో టైగర్ 3 మూవీకి కలెక్షన్స్ తగ్గాయి.ఈ టైగర్ 3 మూవీ ఇండియాలో తొలి రోజు రూ.44.5 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. తర్వాత రెండో రోజు రూ.52 కోట్లు అలాగే మూడో రోజు రూ.48 కోట్లు వసూలు చేసింది. అయితే నాలుగో రోజు క్రికెట్ మ్యాచ్ ప్రభావం గట్టిగానే పడింది.
టైగర్ 3 మూవీ నాలుగో రోజు కేవలం రూ.23 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నాలుగు రోజులు కలిపి ఈ సినిమా రూ.170 కోట్లు రాబట్టింది. వరల్డ్ కప్ సెమీఫైనల్ కారణంగా తగ్గిపోయిన కలెక్షన్లు.. ఇలాగే కొనసాగుతాయా లేక మళ్లీ పుంజుకుంటాయా అనేది చూడాలి..ఈ సినిమాకు తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో రెండు, మూడు రోజుల్లో కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయి.టైగర్ 3 మూవీ ఇండియాలోనే రెండు రోజుల్లో కలిపి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. టైగర్ 3 మూవీలో సల్మాన్ ఖాన్ కి తోడు షారుక్ ఖాన్ మరియు హృతిక్ రోషన్ కూడా అతిథి పాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఇదే బెస్ట్ మూవీ అని ఫ్యాన్స్ కూడా తెలిపారు.. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో టైగర్ 3కి బాక్సాఫీస్ దగ్గర అంతగా కాంపిటీషన్ లేదు.దీంతో ఆదివారం (నవంబర్ 19) వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు వరకూ మరోసారి ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వరల్డ్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ సినిమా కలెక్షన్లను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి..
