Site icon NTV Telugu

TTE Suspend: టికెట్ లేదని ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Tte Suspend

Tte Suspend

రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి టికెట్ తీసుకోలేదని అతి దారుణంగా కొట్టాడు రైల్వే టీటీఈ. ఈ ఘటన బరౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టికెట్ తీసుకోలేని పాపానికి మరీ ఇంత దారుణంగా ఎవరైనా కొడతారా.. టికెట్ లేకుంటే ఫైన్ వేయాలి కానీ, చేయి ఉంది కదా అని ఎలా పడితే అలా కొట్టేయడమేనా..?. ఇదిలా ఉంటే.. ఆ వ్యక్తిని అంత దారుణంగా కొడుతుంటే పక్కన ఉన్న ప్రయాణికులు కూడా ఏంటని ప్రశ్నించారు. వారిపై సైతం దురుసుగా ప్రవర్తించాడు టీటీఈ. కాగా.. ఈ వీడియోను అందులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేశాడు.

Read Also: Navi Mumbai: ప్రియురాలిని చంపిన ప్రేమికుడు.. నెల తర్వాత మృతదేహం లభ్యం

అంతేకాకుండా.. ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేశాడు. వీళ్లకు ఇలా కొట్టే స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించాడు. టీటీఈ పేరుతో గూండాలా ప్రవర్తిస్తారా అని అన్నాడు. ఇతను వ్యవస్థలో ఎందుకు ఉన్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కాగా.. ఈ పోస్ట్ ను చూసిన నార్త్ ఈస్టర్న్ రైల్వే.. వీడియోను చూసిన తర్వాత విషయాన్ని గ్రహించి టీటీఈని తక్షణమే సస్పెండ్ చేశారు.

Read Also: Tamil Nadu: కాంచీపురంలో కొట్టుకున్న ఆలయ పూజారులు.. వీడియో వైరల్

Exit mobile version