NTV Telugu Site icon

Thunderstorm Warning: ఏపీలో ఉధృతంగా పిడుగులు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!

Thunderstorm And Rain

Thunderstorm And Rain

Thunderstorm Warning: ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. అయితే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల్లోని ప్రజలు.. మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట ప్రాంతాల ప్రజలు.. అల్లూరి జిల్లాలోని అనంతగిరి, అరకులోయ, జీకే వీధి, కొయ్యూరు మండల్లాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వార్నింగ్‌ ఇచ్చారు.. అయితే, పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించారు.. బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవడమే మంచిదని సూచించారు.. ఈ సమయంలో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి అంటూ ఆయా జిల్లాల ప్రజలకు సూచించారు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్. కాగా, తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. రాత్రికి భారీ వర్షాలు.. మధ్యాహ్నం గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఉదయం చలిలా పరిస్థితి కొనసాగుతోంది..

Read Also: Rahul Gandhi: ఇది రాష్ట్రపతిని అవమానించడమే.. కొత్త పార్లమెంట్ వివాదంపై రాహుల్ గాంధీ