Site icon NTV Telugu

Thug Life : ‘థగ్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన కమల్..!

Thug Life,ott Release

Thug Life,ott Release

లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం కాంపౌండ్ నుంచి వస్తోన్న ఈ మూవీలో కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, దుల్కర్ సల్మాన్‌, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా. ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, దర్శకుడు మణిరత్నానికి చెందిన మద్రాస్ టాకీస్, ఉదయనిధి స్టాలిన్‌కు రెడ్ఫి జెయింట్ ఫిలింస్ మీద సినిమా రూపొందింది. ఇక..

Also Read: Anushka : సోలో రిలీజ్ కోసం ‘ఘాటి’ మూవీకి తప్పని తిప్పలు..

ఇటి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రాగా. ఈ చిత్రం జూన్‌ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా ఓ మీడియాతో ముచ్చటించగా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? అంటే.. ‘ఆగస్టు వరకు వెయిట్ చేయాలి. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే మా సినిమా ఓటీటీ లోకి వస్తుంది’ అని కమల్ హాసన్ స్పష్టం చేశారు. కాగా ఈ ‘థగ్ లైఫ్’ ఓటీటీ హక్కులను ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా. తమిళం తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారట.

Exit mobile version