Site icon NTV Telugu

Telangana: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యనిర్వాకవర్గ సమావేశంలో మూడు తీర్మానాలు అమోదం

Tpta

Tpta

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యనిర్వాకవర్గ సమావేశం మూడు తిర్మానాలను అమోదించారు. సోమావారం రాష్ట్ర అధ్యక్షులు హనుమంత రావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డైరీని, క్యాలెండర్లను ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ శ్రీ ఏవీఎన్ రెడ్డి గారు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలో 20 20 నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని, తీర్మానించడంతో జరిగింది.

Also Read: Christmas Drone Show: క్రిస్మస్ వేళ ఆకాశంలో అద్భుతం.. గిన్నిస్ రికార్డుకు ఎక్కిన డ్రోన్ షో

అలాగే ఉపాధ్యాయ, విద్యారంగా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తీర్మానం, వందల సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్టను 22 జనవరి 2024 సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ కు అభినందలు తెలియజేస్తూ తీర్మాన చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్, రాష్ట్ర సహాధ్యక్షులు పాపిరెడ్డి అదనపు ప్రధాన కార్యదర్శి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read: Alia Bhatt: ఎట్టకేలకు కూతురిని చూపించిన రణ్‌బీర్- అలియా.. ఎంత క్యూట్‌గా ఉందో..!

Exit mobile version