Temples Vandalized: బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా హిందువుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో మూడు హిందూ దేవాలయాలను నినాదాలు చేస్తూ దుండగుల గుంపు ధ్వంసం చేసింది. నగరంలోని హరీష్ చంద్ర మున్సెఫ్ లేన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు దాడి జరిగిందని, ఈ సందర్భంగా శాంతనేశ్వరి మాత్రి ఆలయం, శని మందిరం, శాంతనేశ్వరి కలిబారి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.
Also Read: Fire Accident: వారణాసి రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 200 బైక్స్
వందలాది మంది నినాదాలు చేస్తూ ఆలయాలపైకి ఇటుకలు, రాళ్లు విసిరి మూడు ఆలయాల ద్వారాలను ధ్వంసం చేశారని ఆలయ అధికారులను ఉటంకిస్తూ న్యూస్ పోర్టల్ పేర్కొంది. ఈ సందర్బంగా.. కొత్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం దాడిని ధృవీకరించారు. దాడి చేసినవారు దేవాలయాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. అయితే ఆలయాలకు తక్కువ నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. ఈ దాడి అనంతరం శాంతినేశ్వరి ఆలయ నిర్వహణ కమిటీ సభ్యుడు తపన్ దాస్ స్థానిక మీడియతో మాట్లాడుతూ.. శుక్రవారం ప్రార్థనల తర్వాత, వందలాది మంది ఊరేగింపు వచ్చారు. వారు హిందూ, ఇస్కాన్ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. వారు దాడి చేస్తున్న సమయంలో మేము దాడి చేసిన వారిని ఆపలేదని, పరిస్థితి మరింత దిగజారినప్పుడు మేము పోలీసులను పిలిచామని అన్నారు. వారు వెంటనే చేరుకొని అక్కడి పరిస్థితిని క్రమ బద్దీకరించారు.
Also Read: Eknath Shinde is unwell: ఏక్‌నాథ్ షిండేకు అస్వస్థత.. అసత్య ప్రచారం చేయొద్దని శివసేన వెల్లడి
మధ్యాహ్నానికి ముందే అన్ని ఆలయాల తలుపులు మూసేశారు. దుండగులు ఎలాంటి మాటలు మాట్లాడకుండా వచ్చి దాడికి పాల్పడ్డారు. బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) మాజీ సభ్యుడు, ఆధ్యాత్మిక నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహం కేసుల్లో నవంబర్ 25న అరెస్టు చేశారు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు చిట్టగాంగ్ కోర్టు నిరాకరించింది.