Site icon NTV Telugu

Premature Babies : ఏటా 10లక్షల శిశువులు మరణిస్తున్నారు.. డబ్ల్యూహెచ్‌ఓ సంచలన విషయాలు

Baby Found In Toilet

Baby Found In Toilet

Premature Babies : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) , యునిసెఫ్ మంగళవారం విడుదల చేసిన సంయుక్త నివేదిక ప్రకారం ప్రపంచంలో ఏటా ఒక మిలియన్ కంటే ఎక్కువ నెలలు నిండకుండానే శిశువులు మరణిస్తున్నారు. 2020 సంవత్సరంలో ప్రపంచంలోని 45 శాతం శిశువులు నెలలు నిండకుండానే జన్మించారు. వారు ఎక్కువగా ఐదు దేశాల్లో పాకిస్థాన్, నైజీరియా, చైనా, ఇథియోపియా, భారతదేశంలో జన్మించారు. 2020లో బంగ్లాదేశ్‌లో 16 శాతం కంటే ఎక్కువ ముందస్తు జనన రేటు ప్రపంచంతో పోలీస్తే అత్యధికంగా నమోదైంది. సంఖ్యాపరంగా చూస్తే 30.16 లక్షల జననాలతో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.

2020లో 9.14 లక్షల మంది పిల్లలతో పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉంది. గత దశాబ్దంలో 152 మిలియన్ శిశువులు నెలలు నిండకుండానే జన్మించారు. పుట్టిన ప్రతి 10 మందిలో ఒకరు నెలలు నిండకుండానే ఉన్నారు. ప్రతి 40 సెకన్లకు ఈ పిల్లలలో ఒకరు చనిపోతున్నారు. ఒక దశాబ్దంలో ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ అకాల జనన రేటులో ఎటువంటి మార్పు లేదు. సంఘర్షణ, వాతావరణ మార్పు, కోవిడ్ ప్రతిచోటా మహిళలు, శిశువులకు ప్రమాదాలను పెంచుతున్నాయి.

ముందస్తు జనన రేటు ఇక్కడ అత్యధికం
బంగ్లాదేశ్ 16.2%
మలావి 14.5 %
పాకిస్తాన్ 14.4%
భారతదేశం 13.0 %
దక్షిణా ఆఫ్రికా 13.0%

Read Also:MI vs RCB: సూర్య ప్రతాపానికి ఆర్సీబీ భస్మం.. ముంబై ఘనవిజయం

ఈ దేశాల్లో అపరిపక్వ పిల్లల సంఖ్య అత్యధికం
భారతదేశం 30,16,700
పాకిస్థాన్ 9,14,000
నైజీరియా 7,74,100
చైనా 7,52,900
ఇథియోపియా 4,95,900

తల్లి ఆరోగ్య సమస్యల కారణంగానే..
తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్నందున చాలాసార్లు నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనివ్వాల్సి భారతీయ వైద్యులు విశ్వసిస్తున్నారు. కరోనా మొదటి వేవ్‌లో ఇన్‌ఫెక్షన్ కారణంగా తల్లి, బిడ్డ ఇద్దరి జీవితాలు ప్రమాదంలో ఉన్నందున ఇటువంటి కేసులు పెరిగాయి. దేశంలో 2014లో మొత్తం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (NICUలు) 18 ఉండగా ఇప్పుడు 700 కంటే ఎక్కువ జిల్లాల్లో 900 కంటే ఎక్కువ ఉన్నాయి. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ వైద్యురాలు డాక్టర్ నీర్జా మాట్లాడుతూ, పరిపక్వత చెందని పిల్లలలో ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పిల్లలలో చాలామంది పుట్టిన ఐదు రోజులకే మరణిస్తున్నారు. బతికిన వారు కూడా భవిష్యతులో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

Read Also:Rajahmundry Crime: వైసీపీ నేత దారుణ హత్య.. అసలు కారణం ఇదే..!

Exit mobile version