NTV Telugu Site icon

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌లో విషాదం.. జలాశయంలో ముగ్గురు గల్లంతు

Kaleshwaram Gravity Canal

Kaleshwaram Gravity Canal

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర్‌ఘాట్ వద్ద వీరు ఈత కోసం వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. వీరంతా హైదరాబాద్‌ నుంచి విహార యాత్రకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి కావడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. గల్లంతయిన వారు చంద్రకాంత్ (20), నాగరాజు(39), హర్షత్(26)గా సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Read Also: Mahindra Vehicles: రూ.1000 కోట్లతో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రం.. సర్కారుతో కుదిరిన ఒప్పందం

Read Also: Gold Smuggling : తమిళనాడులో రూ.10కోట్లు విలువగల బంగారం పట్టివేత

Read Also: Phone Addict: ఫోన్ చూసి చూసి కళ్ళు పోగొట్టుకున్న హైదరాబాదీ మహిళ