Site icon NTV Telugu

Bomb threat: బెంగళూరులో పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు

Bomb

Bomb

దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే స్కూళ్లు, హాస్పటల్స్, ఎయిర్‌పోర్టు, కేంద్ర హోంశాఖకు కూడా ఈ మెయిల్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనిఖీలు తర్వాత నకిలీవిగా పోలీసులు తేల్చారు. తాజాగా బెంగళూరులోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Liquor Truck Overturns: మద్యం లారీ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ ప్రజలు..

గురువారం బెంగళూరులోని మూడు హోటళ్లకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. మూడు ప్రముఖ హోటళ్లకు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ హోటళ్లలో ది ఒటెర్రా కూడా ఉందని సౌత్ ఈస్ట్ బెంగళూరు డీసీపీ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో బాంబు నిర్వీర్యం మరియు డిటెక్షన్ బృందాలు తనిఖీలు చేపట్టారని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన తర్వాతే ఈ కాల్ రావడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇది కూడా చదవండి: Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఇద్దరు టాలీవుడ్ నటుల బ్లడ్లో డ్రగ్స్?

ఏప్రిల్‌లో ఢిల్లీ-ఎన్‌సీఆర్, జైపూర్, ఉత్తరప్రదేశ్, బెంగళూరులోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. తనిఖీల తర్వాత బూటకమని పోలీసులు తేల్చారు. ఇక ఈ ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు కోరింది. ప్రతిస్పందనగా ఢిల్లీ పోలీసులు మే 17న ఒక నివేదికను సమర్పించింది. ఐదు బాంబు స్క్వాడ్‌లు, 18 బాంబు డిటెక్షన్ బృందాలు పాల్గొన్నాయి.

ఇక ఈ బెదిరింపు కాల్స్‌పై ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దృష్టి పెట్టింది. సందేశాలపై దృష్టి సారించినట్లు CEO రాజేష్ కుమార్ తెలిపారు.ఈ బెదిరింపులకు కారణమైన వ్యక్తులను గుర్తించేందుకు అనేక దేశాలతో దర్యాప్తు సంస్థలు సహకరిస్తున్నాయని ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Actress Murdered: నటిని సుత్తితో కొట్టి చంపేశాడు.. మరీ ఇంత దారుణంగానా?

Exit mobile version