Swati Maliwal: నాపై దాడి జరిగిన సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు.. స్వాతి మలివాల్ సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారని అరవింద్ కేజ్రీవాల్‌పై ఆరోపణలు గుప్పించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలు వెల్లడించారు. మే 13న కేజ్రీవాల్ నివాసంలోనే తనపై దాడి జరిగిందని, తాను కేకలు వేసినా కూడా సహాయం చేయడానికి ఎవరూ రాలేదని చెప్పారు. బిభవ్ కుమార్ తన చెంపపై కొడుతూ తన్నాడని, ఈడ్చుకెళ్లాడని ఆప్ ఎంపీ పేర్కొన్నారు.
Read Also: Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఇద్దరు టాలీవుడ్ నటుల బ్లడ్లో డ్రగ్స్?
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
‘‘ మే 13 ఉదయం 9 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి అతడిని చూసేందుకు వెళ్లాను. అతని సిబ్బంది తనను డ్రాయింగ్ రూంలో కూర్చోమని చెప్పారు. అరవింద్ జీ ఇంట్లోనే ఉన్నారని, నన్ను కలవడానికి వస్తున్నారని చెప్పారు. మరుసటి క్షణం బిభవ్ కుమార్ డ్రాయింగ్ రూంలోకి వచ్చి నన్ను కొట్టడం ప్రారంభించారు. 7-8 సార్లు చెంపపై కొట్లటాడు. నేను అతడిని నెట్టడానికి ప్రయత్నించిన సమయంలో పట్టుకున్నాడు. నా తల టేబుల్‌కి తగిలి కింద పడ్డాను. ఆ తర్వాత నన్ను తన్నడం ప్రారంభించాడు’’ అని స్వాతి మలివాల్ చెప్పారు.
తాను సాయం కోసం అరిచినా, ఎవరూ రాకపోవడం తనకు వింతగా ఉందని చెప్పారు. ఎవరైనా సూచనల మేరకు బిభవ్ కుమార్ వ్యవహరిస్తున్నారా..? అని ప్రశ్నించిన సమయంలో.. మలివాల్ మాట్లాడుతూ.. ‘‘ఇదంతా ఇప్పుడు దర్యాప్తు విషయం, నేను ఢిల్లీ పోలీసులకు దర్యాప్తులో సహకరిస్తున్నాను. నేను ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదని, తాను డ్రాయింగ్ రూంలో ఉన్న ప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’’ అని ఆమె చెప్పారు. నా భద్రత, నా కెరీర్ విషయంలో వీరు ఎంత వరకు వెళ్లవచ్చనే విషయాన్ని తాను పట్టించుకోనని ఆమె అన్నారు. ఈ విషయంలో ఆప్ బిభవ్ కుమార్‌కి ఎందుకు మద్దతు ఇస్తుందో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. దాడి జరిగిన తర్వాత బిభవ్ కుమార్ తాను పోలీసులకు ఫోన్ చేస్తున్న విషయాన్ని గమనించి గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీని పిలిచి వీడియో తీయించాడని ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!