Enumamula Market: రేపటి నుండి మూడు రోజుల పాటు వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. రేపు మహాశివరాత్రి, 9వ రెండో శనివారం, పదో తేదీన ఆదివారం కావడంతో తిరిగి వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమవుతుందని రైతులకు గమనించాలని అధికారులు సూచించారు. 11వ తేదీ నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని మార్కెట్ అధికారులు తెలియజేశారు. రైతులు సెలవు రోజుల్లో మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావద్దని కోరారు.
Read Also: Kodanda Reddy : ఎల్‌ఆర్‌ఎస్‌పై ఇచ్చిన జీవోలు రెండు కూడా గత ప్రభుత్వం ఇచ్చినవే
రేపటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడంతో తమ పంటను అమ్ముకోవడానికి నేడు రైతులు మార్కెట్‌కు క్యూ కట్టే అవకాశం ఉంది. మిర్చి పంట ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఆలస్యం చేయకుండా మిర్చి పంటను ఇవాళే అమ్ముకునేందుకు రైతన్నలు మార్కెట్‌కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.