Site icon NTV Telugu

Astronauts Returned To Earth: 192 రోజుల తర్వాత భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు

China

China

Astronauts Returned To Earth: చైనా అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్‌లో ఆరు నెలలు కంటే ఎక్కువ సమయం గడిపిన తర్వాత.. ముగ్గురు చైనా వ్యోమగాములు సోమవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. యె గ్వాంగ్‌ఫు, లి కాంగ్, లి గ్వాంగ్సుతో కూడిన షెన్‌జౌ-18 అంతరిక్ష నౌక స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:24 గంటలకు ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌ లోని డాంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్‌లో దిగింది. ఈ ల్యాండింగ్ విజయవంతంగా పూర్తియిన తర్వాత.. వ్యోమగాములు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని చైనా మానవసహిత అంతరిక్ష యాత్రల సంస్థ తెలిపింది.

Also Read: Murder Case: కూతురిని వ్యభిచారంలోకి దించాలని ప్రయత్నించడంతో మహిళని హత్య చేసిన తండ్రికూతురు

ఈ సందర్బంగా వ్యోమగామి లి గ్వాంగ్సు మాట్లాడుతూ.. తాను స్పేస్ స్టేషన్‌లో చెర్రీ టొమాటోలు, పాలకూరను పండించానని చెప్పాడు. అంతరిక్షంలో తాజా కూరగాయలు తినగలగడం నిజంగా ఓ వరం అని అన్నారు. ఈ మొక్కలు అక్కడ పచ్చదనంతో కూడిన అనుభూతిని కలిగించాయని, బిజీగా ఉన్న పనిలో ఉత్సాహాన్ని మిగిల్చాయని తెలిపాడు. ఇక సుదీర్ఘకాలం రోదసిలో గడిపిన చైనా వ్యోమగామిగా గువాంగ్‌ఫు రికార్డు నెలకొల్పారు. ఇదివరకు అంతరిక్ష యాత్రలతో కలిపి ఆయన ఏడాదికిపైగా రోదసిలో ఉన్నారు. దాంతో చైనీస్ వ్యోమగామిగా కక్ష్యలో ఎక్కువ కాలం గడిపిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

Also Read: Solidarity Rally In Canada: హిందూ దేవాలయంపై దాడులకు వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ చేపట్టిన హిందువులు

Exit mobile version