చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో శిరీష హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సరిత, వినయ్ కుమార్, నిహల్ కుమార్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పెట్టారు. 2016లో సరిత, శిరీష కలిసి సన్ రైజ్ హాస్పిటల్ లో పని చేశారు.. 2016 ఏప్రిల్ లో వినయ్ కుమార్ తో శిరీష పెళ్లి సెట్ చేసింది సరిత.. శిరీష 2024 లో హయత్ నగర్ వివేరలో కూడా పని చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న వివేర హాస్పిటల్ లో రిజైన్ చేసింది.
READ MORE: RS Brothers: అత్తాపూర్లో ఆర్ఎస్ బ్రదర్స్ 13వ షోరూం ఓపెన్ చేసిన నిధి అగర్వాల్!
సరితకు చెప్పకుండా ఉద్యోగం మానేసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది.. ఈనెల 1న శిరీషపై సరిత దాడి చేసింది.. అసభ్యపదజలంతో దూషిస్తూ మెడపై ఐరన్ రాడ్ తో దాడి చేసింది.. అపస్మారక స్థితిలో ఉన్న శిరీషకి హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చింది. శిరీష స్పృహ కోల్పోయాక.. దిండుతో మొహంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసింది సరిత.. సరిత తన అక్క కొడుకు నిహాల్ సహాయంతో.. సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారు.. హత్యకు ఉపయోగించిన పిల్లో, బెడ్ షీట్, ఐరన్ రాడ్ ను పోలీసులు సీజ్ చేశారు.
READ MORE: Game Changer: హిందీ స్ట్రీమింగ్ కి రెడీ అయిన గేమ్ ఛేంజర్
ఈ కేసు వివరాలను ఏసీపీ శ్యామ్‌సుందర్ వెల్లడించారు. “శిరీష మేనమామ ఫిర్యాదు చేశాడు.. శిరీష మృతి పై అనుమానాలు ఉన్నాయి అని చెప్పాడు.. దోమల పెంట తరలిస్తున్న సమయంలో ఆమన్ గల్ వద్ద వెళ్తుండగా వినయ్ కుమార్ కి కాల్ చేసి.. అంబులెన్స్ ను వెనక్కి రప్పించాం.. అనుమానాస్పద స్థితి లో మృతి కింద కేసు నమోదు చేసి విచారించాం.. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో.. గొంతు పిసికి చంపినట్లు తెలిపారు వైద్యులు. శిరీష భర్త వినయ్ కుమార్, అక్క సరిత, మరో అక్క కొడుకు నిహాల్ ను అదుపులోకి తీసుకుని విచారించాం.. శిరీష ను తానే హత్య చేసినట్లు సరిత ఒప్పుకుంది.. సరిత, శిరీష ఇద్దరూ సన్ రైజ్ హాస్పిటల్ లో పరిచయం అయ్యారు. శిరీష అనాధ అవడంతో.. తన తమ్ముడు వినయ్ తో పెళ్ళి సంబంధం సెట్ చేసింది. నర్స్ ట్రైనింగ్ చేసిన శిరీష సన్ రైజ్ లో మానేసి కాచిగూడ బ్రిస్టల్ కోన్ హాస్పిటల్ లో చేరింది. ఆ తర్వాత వివేర హాస్పిటల్ లో చేరింది శిరీష.. కొన్ని నెలల తర్వాత ఇక్కడ కూడా మానేసింది.. ఒక్కచోట కూడా కుదురుగా పని చేయవు అని శిరీష, సరిత మధ్య గొడవ జరిగింది.. గొడవ సమయంలో నీ చరిత్ర, నీ అక్రమ సంబంధాలు అన్నీ నాకు తెలుసు.. అందరికీ చెప్తాను అని శిరీష.. సరిత తో అన్నది. మరుసటి రోజు శిరీష వెళ్ళి సరిత కు సారీ చెప్పింది.. సరిత కు మత్తుమందు వేసుకునే అలవాటు ఉంది.. శిరీష.. తనకు నిద్ర పట్టడం లేదని, మత్తు మందు కొంచం ఇవ్వమని సరిత ను అడిగింది.. ఎప్పటికైనా శిరీష తన చరిత్ర అంతా బయటపెట్టే అవకాశం ఉందని భావించిన సరిత.. మత్తు మందు డోజ్ పెంచి ఇచ్చింది.” అని ఏసీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు.