Site icon NTV Telugu

Bomb Threat: పాకిస్తాన్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం.. హౌసింగ్ సొసైటీ గోడపై బెదిరింపు సందేశాలు

Bomb Thret

Bomb Thret

స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరపడుతున్న తరుణంలో బెదిరింపు సందేశాలు కలకలం రేపాయి. పాక్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం అని గోడలపై బెదిరింపు మెసేజ్ లు ఆందోళనకు గురిచేశాయి. బెంగళూరులో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక హౌసింగ్ సొసైటీ గోడపై రాసిన బెదిరింపు సందేశం సంచలనం సృష్టించింది. గోడపై “పాకిస్తాన్ నుంచి భారతదేశాన్ని పేల్చివేస్తాం” అని రాసి ఉంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. వెంటనే పోలీసులు, బాంబు నిర్వీర్య దళాన్ని సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో దాదాపు 300 కుటుంబాలు నివసిస్తున్నాయి.

Also Read:Poonam Bajwa : పదునైన అందాలతో రెచ్చిపోయిన పూనమ్ బజ్వా

బెంగళూరులోని కోడిగేహళ్లిలోని ఆల్ఫైన్ పిరమిడ్‌లో ఈ సంఘటన జరిగింది. స్థానిక నివాసితులు సొసైటీ గోడపై ఈ అనుమానాస్పద, రెచ్చగొట్టే సందేశాన్ని చూశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్ దర్యాప్తు ప్రారంభించింది. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Also Read:CM Revanth Reddy: రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయం..

ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని, కానీ ముందుజాగ్రత్తగా భద్రతను పెంచామని అధికారులు తెలిపారు. ఆకతాయిల పని కావచ్చు లేదా మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తి చేసిన పని కావచ్చు అని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందేశాన్ని ఎవరు, ఎప్పుడు రాశారో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Exit mobile version