NTV Telugu Site icon

Threat to RSS Chief: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు మావోయిస్టుల నుంచి బెదిరింపు.. పోలీసులు అలర్ట్‌

Rss Chief

Rss Chief

Threat to RSS Chief: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఫిబ్రవరి 10న బీహార్‌లోని భాగల్‌పూర్ పర్యటనకు ముందు ఐఎస్‌ఐ, నక్సలైట్లు, ఛాందసవాదుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మోహన్‌ భగవత్ పర్యటన కోసం తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ధనంజయ్ కుమార్ అప్రమత్తంగా ఉన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ సందర్శించాల్సిన మహర్షి గుహను కూడా ఎస్‌ఎస్పీ పరిశీలించారు. మోహన్‌ భగవత్ పర్యటన నేపథ్యంలో అన్ని ప్రాంతాలను తనిఖీ చేశామని, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి సమస్య ఉండదని అధికారులు వెల్లడించారు. సీసీటీవీ నిఘా కూడా ఉంటుందని, అలాగే పోలీసులు సాధారణ దుస్తుల్లో కూడా మోహరిస్తారని పేర్కొన్నారు.

Paper Leak: స్టాఫ్‌నర్సుల రిక్రూట్‌మెంట్ ప్రశ్నాపత్రం లీక్.. పరీక్ష రద్దు

ఫిబ్రవరి 10వ తేదీన మహర్షిలోని కుప్పఘాట్ ఆశ్రమంలో సద్గురు నివాసం ప్రారంభించబడుతుందని, అలాగే పరమహంస మహారాజ్‌పై రూపొందించిన డాక్యుమెంటరీ పోస్టర్‌ను ఆవిష్కరించడం కూడా గమనించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.మోహన్ భగవత్ కార్యక్రమం మూడు గంటల 45 నిమిషాల పాటు సాగనుంది. ఆయన మహర్షి మెహి తపస్సు చేసిన ప్రసిద్ధ గుహను కూడా సందర్శించనున్నారు. ఆ తరువాత ఆయన నౌగాచియాకు బయలుదేరనున్నారు.