ఇజ్రాయిల్ లో వేల సంఖ్యలో జనం నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి యోవా గాలెంట్ ను ప్రధాని బెంజిమెన్ నెతాన్యూ ను తొలగించారు. దీంతో ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయిల్ ప్రజలు ఆందోళన బాట పట్టారు. న్యాయ వ్యవస్థను మార్చాలని నెతాన్యూ చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. దీంతో ఆయనను క్యాబినెట్ నుంచి ప్రధాని తొలగించారు. దీంతో జెరుసలాంలో జరిగిన ప్రదర్శనలో పోలీసులు, సైనికులు వాటర్ క్యాన్ లతో నిరసనకారుల్ని చెదరగొట్టారు.
Also Read : YS Viveka Murder Case: సీబీఐ తీరుపై సుప్రీం ఆగ్రహం.. కీలక ఆదేశాలు
న్యాయ వ్యవస్థలో చేపట్టాలనుకుంటున్న సంస్కరణలను ఆపివేయాలని ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఇజాక్ హెర్ జోగ్ పిలుపునిచ్చాడు. కొత్త చట్టాల సంస్కరణల ప్రకారం.. జడ్జీల నియామకం పూర్తిగా ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. ఈ విషయంలో వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో దీన్ని వెంటనే నిలిపివేయాలని అధ్యక్షుడు వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. అన్ ఫిట్ గా తేలిన నాయకున్ని తొలగించాలన్న నిబంధనలను కూడా మార్చనున్నారు.
Also Read : Chatrapathi: ప్రభాస్ ని గుర్తు చేసిన బెల్లంకొండ హీరో… నార్త్ లో హిట్ పడినట్లే
అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెంజిమన నెతన్యూ చట్టాల మార్పుతో శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. దీంతో ఇజ్రాయిల్ ప్రజలను పోలీస్, సైనిక అధికారులు నిరసన కార్యక్రమాలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పలుచోట్లు విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వెంటనే దేశంలో నెలకొన్న పరిస్థితులు చక్కదిద్దలని అధికారులకు ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు సూచించారు.