Condom Packets: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలో ఉన్న నదులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో వరద మరింత బీభత్సం సృష్టించడంతో కొన్ని ఊర్ల మధ్య రాకపోక సంబంధాలు తెగిపోయాయి. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో పంట నష్టం కూడా జరిగిందని సమాచారం. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రాణ నష్టం కాకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.
Suriya64 : వెంకీ అట్లూరి – సూర్య ‘టైటిల్’ ఇదే
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో కురిసిన వర్షం దెబ్బకు పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలలతో లోతట్టు ప్రాంతాలు జలయం అయ్యాయి. అయితే ఇదే వరదలో వేల సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లు కొట్టుకవచ్చాయి. వీటిని చూసిన ప్రజలు ఇన్ని కండోమ్స్ ఏంటి? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో వరదలో వేల సంఖ్యలో కండోమ్ (నిరోధ్) ప్యాకెట్లు ఒక్కసారిగా వరదలో కొట్టుకొచ్చాయి. అయితే, ఇవి హెచ్ఐవీని అరికట్టేందుకు ప్రభుత్వం ఐటీసీటీ సెంటర్లకు వీటిని సరఫరా చేస్తుంది. కాకపోతే, వాటిని అలాగే ఉంచడం లేదా వాటిని అందించడంలో నిర్లక్ష్యం వహించడం కారణంగా అవి వరదలో భారీగా కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
