Site icon NTV Telugu

Tholiprema : రీ రిలీజ్ లో రికార్డు క్రియేట్ చేసిన తొలిప్రేమ..

Whatsapp Image 2023 07 01 At 9.23.02 Pm

Whatsapp Image 2023 07 01 At 9.23.02 Pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా తొలిప్రేమ.అప్పటి వరకు మాములు హీరోగా వున్న పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో స్టార్ హీరోగా మారాడు.టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది ఈ చిత్రం. ఇప్పటికీ కూడా ఈ సినిమాని చూసేందుకు యూత్ ఎంతో ఆసక్తి ని చూపిస్తున్నారు.ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయినా నేటి తరం పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది వున్నారు.. అందుకే ఈ చిత్రాన్ని మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేసింది శ్రీ మాత క్రియేషన్స్. లేటెస్ట్ 4K క్వాలిటీ తో చిత్రాన్ని రీ మాస్టర్ చేయించి ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.

ఈ సినిమాకి వచ్చే డబ్బులు జనసేన పార్టీ కి డొనేషన్ గా వెళ్లే ఛాన్స్ లేదని తెలుసుకున్న అభిమానులు, ఈ చిత్రాన్ని స్వచ్ఛందం గా బాయ్ కాట్ చెయ్యడానికి పిలుపు నిచ్చారు.కానీ పవన్ కళ్యాణ్ సినిమా రీ రిలీజ్ సినిమాకు బాయ్ కాట్ తో ఫ్యాన్స్ రాకుండా ఆపడం కష్టమే. అందుకే ఈ సినిమాకి మొదటి రోజు బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి.అది కూడా అన్నీ చోట్ల ఉదయం ఆటలే అవ్వడం విశేషం. అయ్యినప్పటికీ కూడా ఈ సినిమాకి హౌస్ ఫుల్ షోస్ పడ్డాయి అంటే పవర్ స్టార్ క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాకి కేవలం నైజాం ప్రాంతం లోని హైదరాబాద్ సిటీలో మొదటి రోజు 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. 1998 వ సంవత్సరం లో విడుదలైన సినిమాకి ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోవడం మాములు విషయం కాదు. పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ కి ఇది ఒక నిదర్శనం గా నిలిచింది.ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్ళు వచ్చాయి. చిత్రానికి మొదటి రోజు కోటి 23 లక్షల గ్రాస్ వచ్చినట్టు సమాచారం.

Exit mobile version