OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఓజి. ముంబై బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించగా ఒక డై హార్డ్ ఫ్యాన్ పవన్‌ను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో.. ఓజితో చూపించబోతున్నాడు సుజీత్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా పవన్ ఒక్కసారి డేట్స్ ఇస్తే చాలు.. షూటింగ్ మొత్తం పూర్తవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. పవన్ కూడా మిగతా సినిమాల కంటే ముందుగా ఓజి సినిమాను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓజి సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.
Read Also:Mahindra XEV 9E, BE 6: మహీంద్రా XEV 9E, BE 6 టాప్ వేరియంట్స్ ధరలు, బుకింగ్ షెడ్యూల్ రిలీజ్..
ఇక ఈ సినిమాపై తాజాగా సంగీత దర్శకుడు తమన్ చెప్పిన మాటలు ఇపుడు వైరల్ గా మారాయి. అదేమంటే ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం తమిళ స్టార్ శింబును సంప్రదించారట. దీంతో ఆయన వెంటనే పాడతానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా కోసం ఓ పవర్ఫుల్ ట్రాక్ ఆల్రెడీ రెడీ అయిందట. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక వేరే లెవెల్లో ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటున్నాడు. ఫైర్ స్ట్రాం ఈజ్ కమింగ్ అంటూ సాగే ఈ పాటనే శింబు పాడినట్టుగా థమన్ కన్ఫర్మ్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా 2025 సమ్మర్ కానుకగా మార్చ్ 27న ఓజి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.
Read Also:Ras Kik Coco : రిలయన్స్ ” కిక్” ఇచ్చే కూల్ డ్రింక్.. టాటాకు పోటీగా..!