NTV Telugu Site icon

Mans Belly Dance : ఏందిరయ్యా ఈ అరాచకం.. ఏదేమైనా సూపర్

New Project

New Project

Mans Belly Dance : భారత దేశంలో ప్రతిభకు కొదవ లేదు.. సోషల్ మీడియాలో ప్రతీరోజు దాదాపు ఎవరో ఒకరు మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు బెల్లీ డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావేరి అనే యూజ‌ర్ ఈ వైర‌ల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటి వరకు లక్షన్నరకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో ఓ యువ‌కుడు బెల్లీ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లో అద‌ర‌గొట్టాడు.

Read Also: Minister Errabelli : దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారు

48 సెకన్ల క్లిప్‌లో, ఒక వ్యక్తి తన బెల్లీ డ్యాన్స్ ప్రదర్శనతో మ్యాజిక్‌ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తున్న పెప్పీ బీట్‌లకు అతను అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అత‌డి గ్రేస్‌ఫుల్ పెర్ఫామెన్స్‌ను మెచ్చిన నెటిజ‌న్లు కామెంట్స్ సెషన్లో ప్రశంసల వర్షం కురిపించారు. అత‌డి డ్యాన్స్ బ్రిలియంట్ అని ఓ యూజ‌ర్ రాసుకురాగా, అతడికి ఇదో వ‌ర‌మ‌ని మ‌రో కామెంట్ వ్యాఖ్యానించారు.

Show comments