Idli ATM: డబ్బులిచ్చే ఏటీఎం ఓకే.. ఇడ్లీ ఇచ్చే ఏటీఎంను చూశారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Idli ATM: ఇప్పటి వరకు మనకు ఏటీఎం అంటే వాటిలో డబ్బులు మాత్రమే వస్తాయని తెలుసు. కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వాటర్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. అంటే కాయిన్స్ వేసి బాటిళ్లలో నీటిని నింపుకుని వెళ్లవచ్చన్న మాట. ఇలా వేర్వేరు సేవల నిమిత్తం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా రకరకాల ఏటీఎంలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఆలోచనే చేసింది బెంగుళూరుకు చెందిన ఓ స్టార్టప్. ఏటీఎం ద్వారా ఇడ్లీలను సప్లై చేస్తోంది. దీనిని ఇడ్లీ బాట్ లేదా ఇడ్లీ ఏటీఎంగా పిలుస్తున్నారు. ఇడ్లీ తయారు చేయడం, ప్యాకేజీ చేయడం, సప్లై చేయడం లాంటి ప్రాసెస్ మొత్తం వెంటవెంటనే జరిగిపోతుంది.
బెంగళూరుకు చెందిన ఆంట్రప్రెన్యూర్స్ షరన్ హీరేమత్, సురేష్ చంద్రశేఖరన్ ఫ్రెషాట్ రోబోటిక్స్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ స్టార్టప్ ఇడ్లీ ఏటీఎంను తయారు చేసింది. బెంగళూరులో మొదటి ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది ఈ స్టార్టప్. మొత్తం ఆటోమేటెడ్ ప్రాసెస్‌లో పనిచేస్తుంది. కస్టమర్ వచ్చి తమకు కావాల్సిన ఆర్డర్ ఇస్తే చాలు, వేడివేడి ఇడ్లీ పార్శిల్లో వచ్చేస్తుంది. అక్కడే చట్నీ, సాంబార్ కూడా ఉంటుంది. పార్శిల్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. లేదా ఇడ్లీ అక్కడే టేస్ట్ చేయొచ్చు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: Apple: చార్జర్ లేకుండా ఫోన్ అమ్మినందుకు యాపిల్ సంస్థకు రూ. 164కోట్ల జరిమానా
ఈ అద్భుతమైన ఐడియా వెనుక షరన్ హీరేమత్ ఎదుర్కొన్న అనుభవమే కారణం. 2016లో తన కూతురుకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అర్ధరాత్రి ఇడ్లీ కొనడానికి బయటకు వెళ్లాడు. కానీ ఎక్కడా రెస్టారెంట్లు తెరిచిలేవు. ఎప్పుడంటే అప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంలు ఉన్నట్టు, ఇడ్లీ కొనడానికి ఏటీఎంలు ఎందుకు ఉండకూడదని అనుకున్నాడు. ఎప్పుడైనా ఫ్రెష్ ఇడ్లీ సప్లై చేయడానికి ఇడ్లీ ఏటీఎం తయారు చేయాలన్న ఆలోచనతో ఫ్రెషాట్ రోబోటిక్స్ స్టార్టప్ ప్రారంభించారు.
Read Also: Karnataka: నలుగురు మైనర్లపై లైంగిక వేధింపులు..లింగాయత్ పీఠాధిపతిపై మరో కేసు
ఆటోమెటిక్ మెషీన్ సాయంతో ఎప్పుడైనా ఇడ్లీ కొనడానికి ఇది సరైన మార్గమని వారి అభిప్రాయం. తమ ఫుడ్బాట్ ఇడ్లీలు మాత్రమే కాదు, దక్షిణ భారత దేశానికి చెందిన రుచికరమైన వంటకాలను అందించే మొదటి పూర్తి ఆటోమేటెడ్ కుకింగ్ అండ్ వెండింగ్ మెషీన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో రెండు లొకేషన్లలో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో ఈ మెషీన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఇన్నారు. కేవలం ఇడ్లీ బాట్ కాకుండా దోశా బాట్, రైస్ బాట్, జ్యూస్ బాట్లను పరిచయం చేస్తామంటున్నారు.
Idli ATM in Bangalore… pic.twitter.com/NvI7GuZP6Y
— B Padmanaban (padmanaban@fortuneinvestment.in) (@padhucfp) October 13, 2022
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!