Site icon NTV Telugu

Bhagavantudu : తిరువీర్ హీరోగా కొత్త సినిమా.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

Whatsapp Image 2024 03 08 At 6.26.03 Pm

Whatsapp Image 2024 03 08 At 6.26.03 Pm

మసూద ఫేమ్ హీరో తిరువీర్ వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు.ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో  ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన పోస్టర్ ని ‘జబర్దస్త్’ ఫేమ్ అదిరే అభి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దాంతో పాటు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ను యాడ్ చేశాడు.ఇప్పటికే హీరో తిరువీర్ ‘మసూద’, ‘పరేషాన్’ లాంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా వేర్వేరు జోనర్లకు చెందినవే. ముఖ్యంగా ‘మసూద’ అయితే చాలాకాలం తర్వాత హారర్ మూవీ లవర్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మాసూద సినిమా తిరువీర్ ను హీరోగా నిలబెట్టింది. దీంతో ‘మసూద’ తర్వాత తనకు వరుస ఆఫర్లు వచ్చాయి.

ఇప్పుడు తిరువీర్ చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ముందుగా శివరాత్రి సందర్భంగా ‘భగవంతుడు’ అనే మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ని ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో అదిరే అభి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ‘భగవంతుడు’ టైటిల్లో భగవంతుడికి కొమ్ములు ఉన్నాయి. పైగా ఇందులో కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఒక వ్యక్తి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పోస్టర్ను షేర్ చేసిన అభి.. ‘ఈ పోస్టర్లో భగవంతుడుకి ఎందుకు కొమ్ములు పెట్టారో గెస్ చెయ్యగలరా?’ అంటూ ప్రశ్న విసిరాడు. దీంతో నిజమే కదా.. అసలు పోస్టర్లో భగవంతుడు అనే పదానికి కొమ్ములు ఎందుకు ఉన్నాయి అని నెటిజన్లు చర్చించడం మొదలుపెట్టారు. ఇక దీంతో పాటు ఈ సినిమాలో తాను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నానని కూడా అతడు బయటపెట్టాడు.

Exit mobile version