NTV Telugu Site icon

School Student: స్కూల్‌లో మూడో తరగతి విద్యార్థి మృతి.. టీచర్‌ కొట్టడం వల్లే!

Student

Student

School Student: వికారాబాద్ జిల్లా పుదూరు మండలం చిలాపూర్‌లోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న ఏడేళ్ల పిల్లాడు కార్తీక్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ పిల్లవాడిని ఉపాధ్యాయుడు కొట్టడం వల్లే కింద పడిపోయాడని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని తెలిసింది. పాఠశాలలో ఉపాధ్యాయుడు చితక బాధడంతో అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. తన కొడుకుని ఉపాధ్యాయుడు కొట్టడంతో మృతి చెందాడు అంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్‌లో చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Read Also: Revanth Reddy: రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు భారీ యాక్సిడెంట్.. తప్పిన ప్రమాదం

కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం మాత్రం ఇంటికి వెళ్లిన అనంతరం అక్కడే బాలుడు బెడ్‌పై నుంచి పడడం వల్ల చనిపోయాడని అనుమానించింది. స్కూల్ యాజమాన్యం దౌర్జన్యంగా కొట్టడం వల్లే కార్తీక్ చనిపోయాడనీ.. చదువు చెబుతారని స్కూల్‌కి పంపితే.. ఏకంగా ప్రాణాలే తీసేశారని ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బాలుడి స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందినవాడు.