NTV Telugu Site icon

Ear Pods: అయ్యో.. విటమిన్ టాబ్లెట్ అనుకొని ఎయిర్ పోడ్స్ మింగిన మహిళ

Ear Pods

Ear Pods

Woman Swallow Ear Pod in USA: మనం ఏదైనా చేసేటప్పుడు శ్రద్దగా చేయడం చాలా అవసరం. ముఖ్యంగా తినే విషయంలో, ఏవైనా తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాగే టాబ్లె్ట్లు వేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోని ఓ మహిళకు విచిత్ర పరిస్థితి ఏర్పడింది. విటమిన్ టాబ్లెట్ అనుకొని మహిళ ఎయిర్ పోడ్స్ మింగేసింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

Also Read: MP Ramesh Bidhuri: తోటి సభ్యుడిని ఉగ్రవాదిగా పేర్కొన్న బీజేపీ ఎంపీ.. ఫైర్ అవుతున్న ప్రతిపక్షాలు

మో కెనెడీ అనే మహిళ రోజూ విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటుంది.  అయితే తాజాగా ఆమె మాత్ర వేసుకుంటున్నప్పుడు ఏదో ఏమరపాటులో ఉంది. దాని కారణంగా విటమిన్ టాబ్లెట్ అనుకొని ఎయిర్ పోడ్స్ ను మింగేసింది. అయితే అప్పటికి కూడా ఆమెకు ఏం అనుమానం రాలేదు. తరువాత నిద్ర మధ్యలో సడెన్ గా ఆమెకు ఆ విషయం గుర్తుకు వచ్చింది. తాను టాబ్లెట్ కు బదులు ఎయిర్ పోడ్స్ మింగానని తెలుసుకొని తీవ్ర భయాందోళనకు గురయ్యింది. దానిని వాంతి చేసుకోవడం ద్వారా బయటకు రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా అది బయటకు రాలేదు. దీంతో  చేసేది లేక ఆమె ఆసుపత్రిలో చేరింది. ఆమెకు డాక్టర్లు స్కానింగ్  చేయగా కడుపులో ఎయిర్ పోడ్స్ ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఎట్టకేలకు దానిని బయటకు తీశారు. తొమ్మిది గంటల పాటు ఆ ఎయిర్ పోడ్  కెనడీ కడుపులోనే ఉండిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మింగేసిన తరువాత కూడా ఆ ఎయిర్ పోడ్ కడుపులో కూడా పనిచేసింది. దీనిని చూసి వైద్యులే షాక్ కు గురయ్యారు. అందుకే ఏవైనా మింగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల కొన్ని సార్లు ప్రాణాలు సైతం పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Show comments