హిందూ మతంలోని ప్రత్యేక పండుగలలో వసంత్ పంచమి ఒకటి. వసంత పంచమి రోజున మహా కుంభమేళాలో నాలుగవ రాజస్నానం నిర్వహిస్తారు. వసంత పంచమి ఫిబ్రవరి 3న రానుంది. నాలుగవ రాజస్నానం రోజున బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.23 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. పవిత్ర నదుల్లో స్నానాలు కూడా ఆచరిస్తారు. అయితే వసంత పంచమినాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆ రోజు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయకూడదు. ఈ నేపథ్యంలో వసంత పంచమి రోజు ఏయే పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
READ MORE: India-Bangladesh: బంగ్లాదేశ్ అక్రమ బంకర్ నిర్మాణం.. అడ్డుకున్న బీఎస్ఎఫ్..
వసంత పంచమి రోజు సరస్వతీ దేవి పూజించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే పూజాపాటవాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. ఎందుకంటే మీరు ఎవరి నుంచైతే జ్ఞానం, విద్యాబుద్ధులను పొందారో వారిని అవమానించడం వల్ల మీకే నష్టాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. వసంత పంచమి పండుగ అనేది పచ్చదనం, పంటలకు సంబంధించింది. అందువల్ల ఈ రోజు ఎలాంటి చెట్టు లేదా మొక్కను నరకడం లేదా తొలగించడం లాంటివి మానుకోవాలి.
READ MORE:GST Collections: జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఎంత వచ్చిందంటే..!
అలాగే ఈ రోజు ఇంట్లో లేదా కుటుంబంలో ఎలాంటి వివాదాలు, తగాదాలకు లేకుండా జాగ్రత్త వహించండి. లేకుంటే సరస్వతీ దేవి ఆగ్రహానికి లోనుకావాల్సి వస్తుంది. ఫలితంగా ఇంట్లో సమస్యలు మొదలు కావడమే కాకుండా కెరీర్ పరంగాను ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ రోజు సాత్వకాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే పండ్లు, కాయలు, పాలు మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసానికి తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా వసంత పంచమి రోజు వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి పాటిస్తే ఇంటిళ్లిపాది సంతోషంగా ఉంటారని నమ్మిక.