పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది.
Also Read : Tollywood Hero : ప్లాప్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో
డే 1 రూ. 154 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సెన్సేషన్ స్టార్ట్ అందుకున్న ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ ఇంకా థియేటర్స్ లో రన్ అవుతోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ. 310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇంతటి సంచనాలు సృష్టించిన OG ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను రిలిజ్ కు ముందే భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ఇప్పటికి థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమాను ఈ నెల 23నుండి అనగా నేటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది OG. 28 రోజుల థియేటర్ రన్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు హిందిలోను OG డిజిటల్ రిలీజ్ అయింది. థియేటర్స్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమా OTT లో ఎలాంటి సంచలనం చేస్తుందో ఎంతటి వ్యూస్ రాబడుతుందో చూడాలి.
