తనను కంపెనీ నుంచి రాజీనామా చేయమని బలవంతం చేస్తోందని.. ఒక BYJU’s ఉద్యోగి లింక్డ్‌ఇన్‌కి వెళ్లి, కన్నీళ్లతో కూడిన వీడియోను పోస్ట్ చేసింది. ఒకవేళ రిజైన్ చేయకపోతే జీతం నిలిపివేస్తామని బెదిరించినట్లు తెలిపింది. ఆకాన్షా ఖేమ్కా అనే ఈ మహిళ అకడమిక్ స్పెషలిస్ట్ గా పనిచేస్తుంది. ఇంటిని పోషించేది తానేనని, బైజస్ తనకు రావాల్సిన జీతాన్ని ఇవ్వకపోతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడతానని చెప్పింది. అంతేకాకుండా తనకు ప్రభుత్వం నుండి మద్దతు కావాలని కోరింది. “దయచేసి తనకు సహాయం చేయాలని.. లేదంటే ఈ పోస్ట్ తర్వాత తనకు ఎలాంటి ఉపయోగం లేకపోతే, తన జీవితాన్ని ముగించాల్సి వస్తుందని పేర్కొంది.
The India House: రామ్ చరణ్ సినిమాలో నటించాలని ఉందా ? ఇలా ట్రై చేసి చూడండి!
ఆ వీడియోలో ఆమే మాట్లాడిన ప్రకారం.. పనితీరు మరియు ప్రవర్తన కారణంగా తనను తొలగిస్తున్నట్లు తన మేనేజర్ చెప్పినట్లు పేర్కొంది. అయితే హెచ్‌ఆర్‌ని కలిసి అడగగా.. తనను తొలగించడానికి కారణం అది కాదని తనకు చెప్పినట్లు ఆకాంక్ష తెలిపింది. “జూలై 28లోగా తాను కంపెనీ నుండి వైదొలగాలని, లేదంటే ఆగస్టు 1న తన జీతం రాదని ఒక సమావేశంలో తనకు అకస్మాత్తుగా చెప్పినట్లు ఆ మహిళ పేర్కొంది. కుటుంబాన్ని తానే పోషిస్తున్నట్లు.. తన భర్త అనారోగ్యంతో ఉన్నాడని తెలిపింది. అంతేకాకుండా అప్పులు ఉన్నాయని.. తన జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి?” అని ఆమె వీడియోలో చెప్పింది.
Bengaluru : బస్ కండక్టర్ మహిళా ప్రయాణికురాలు మధ్య గొడవ..వీడియో వైరల్..
ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో ఆకాంక్షకు సోషల్ మీడియా నుండి ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. “హాయ్ ఆకాంక్ష! మిమ్మల్ని మీరు నమ్మండి. మీకు ఉద్యోగం వెతకడంలో లేదా ఉద్యోగం గురించి తెలుసుకోవడంలో ఏదైనా సహాయం కావాలంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. త్వరలో అంతా సర్దుకుపోతుంది” అని లింక్డ్‌ఇన్ వినియోగదారు రాశారు. “దేవుడు మిమ్మల్ని కొంత మంచి మలుపుతో ఆశీర్వదిస్తాడు.”అని మరొక వ్యక్తి వ్రాశాడు.