Site icon NTV Telugu

Asian Games: ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడల్లో ఆడేందుకు వారికి అనుమతి

Wrestlers

Wrestlers

భార‌త స్టార్ రెజ్లర్లు భ‌జ్‌రంగ్ పూనియా, వినేశ్ ఫోగ‌ట్‌ ట్రయ‌ల్స్ లేకుండానే ఆసియా గేమ్స్‌లో ఆడేందుకు అనుమ‌తి ల‌భించింది. అవును.. ఈ ఇద్దరికీ ట్రయ‌ల్స్ నుంచి మిన‌హాయింపు ఇస్తూ భార‌త ఒలింపిక్‌ స‌మాఖ్య(IOC) అడ్ హ‌క్ క‌మిటీ(ad-hoc panel) ఈరోజు(మంగళవారం) నిర్ణయం తీసుకుంది. మరోవైపు వీరితో పాటు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన తెలిపిన ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్‌కు ట్రయల్స్‌ తప్పలేదు. జూలై 22, 23వ తేదీల్లో ఆసియా క‌ప్ ట్రయ‌ల్స్ నిర్వహించ‌నున్నారు.

Baby: వైష్ణవి చైతన్యను చెప్పుతో కొట్టిన అభిమాని.. వీడియో వైరల్

చైనాలోని హంగ్‌జో వేదిక‌గా ఆసియా క‌ప్ పోటీలు సెప్టెంబ‌ర్ – అక్టోబ‌ర్ మ‌ధ్య జ‌రుగ‌నున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భ‌జ్‌రంగ్, రెండుసార్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌ వినేశ్‌కు ఈ టోర్నమెంట్‌లో మంచి రికార్డు ఉంది. వీరిద్దరూ తమ తమ వెయిట్ కేటగిరీల్లో ఆసియా క్రీడల్లో గెలుపొందారు. జ‌క‌ర్తాలో 2018లో జ‌రిగిన ఆసియా క‌ప్ 65 కిలోల విభాగంలో భ‌జ్‌రంగ్‌, 50 కిలోల విభాగంలో వినేశ్ బంగారు ప‌త‌కాలు సాధించారు. ఈ టోర్నీలో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన భార‌త రెజ్లర్లుగా రికార్డు సృష్టించారు.

Tamil Nadu Minister: తమిళనాడు మంత్రి రూ.41.9 కోట్ల ఆస్తులను ఫ్రీజ్‌ చేసిన ఈడీ

ఈ ఏడాది ప్రారంభంలో బజరంగ్, వినేష్ మరియు సాక్షితో సహా ఇతర రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై మహిళా ఆటగాళ్లను లైంగికంగా వేధించారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఈ రెజ్లర్లు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కూడా చేపట్టారు. ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం భూషణ్ రెజ్లింగ్ సమాఖ్య పనులు చూసుకోవడం లేదని.. అడ్ హక్ కమిటీ ఈ పని చేస్తోంది.

Exit mobile version