ఈరోజుల్లో జనాలు ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే.. అంతే సులువుగా అనారోగ్య సమస్యల బారిన పడతారు.. ఈ మధ్య కొందరు జనాలు ఆరోగ్యం పై కూడా దృష్టి పెడుతున్నారు.. ఏదైన ఉదయం చేస్తే బెటర్ అని అనుకుంటారు.. కానీ సాయంత్రం కూడా కొన్ని పనులు చేస్తే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
చీకటి పడ్డాక స్క్రీన్ కు దూరంగా ఉండాలి.. టీవీ, ఫోన్లు, ఇతర వాటిని వాడటం ఆపేయ్యాలి.. ఉదయం లేచింది మొదలుకొని రోజంతా చూస్తూనే ఉంటాం.. కనీసం ఏడు తర్వాత పక్కన పెట్టి కుటుంబంతో గడిపితే బంధాలు బాగుండటం మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు..
మీకోసమంటూ కాస్తా టైమ్ కేటాయించండి. యోగా, పుస్తకాలు చదవడం, మీకు ఇష్టమైన పనులు చేయండి. వీటి వల్ల మీ రోజు మీకు నచ్చుతుంది.. అప్పుడే ఫ్రెష్ గా ఉండటంతో ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది..
మానవజీవితంలో కష్ట, సుఖాలు కామన్.. ఏడు తర్వాత కష్టాలను పక్కన పెట్టి మీరు సంతోషంగా ఉన్న సమయాన్ని గుర్తు చేసుకోండి.. ఎన్ని భాధలు ఉన్న క్షణాల్లో మాయం అవుతాయి.. ప్రశాంతంగా నిద్రపోతారు..
అలాగే సైలెంట్‌గా ఉండి డీప్ బ్రీథ్ తీసుకోండి. దీని వల్ల మనసు రిలాక్స్ అవుతుంది. నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.. అంతేకాదు రేపు ఏం చెయ్యాలి.. ఎలా రోజును గడపాలి అని ఒక ప్లాన్ వేసుకోండి.. సంతోషం దానంతట అదే వస్తుంది.. ఈ చిన్న పనులు తప్పక చేస్తే మీ జీవితంలో ఒత్తిడి దూరం అవ్వడమే కాదు.. ప్రశాంతంగా జీవిస్తారు..
