NTV Telugu Site icon

Union Bank of India: నేటి నుంచి ఏపీలోని 120 యూబీఐ శాఖల్లో ఈ సేవలు

Union Bank Of India

Union Bank Of India

Union Bank of India: ఖాతాదారులకు మరింతగా చేరువయ్యేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఫీజులు, అన్ని రకాల యూజర్‌ చార్జీలను ఇకపై యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లోనూ చెల్లించొచ్చు. అన్ని రకాల స్టాంప్‌ పేపర్లు కూడా ఈ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి. ఇప్పటివరకు ఈ సేవలు ఎస్‌బీఐ ట్రెజరీ బ్యాంకుల్లోనే ఉన్నాయి. శనివారం నుంచి ఏపీవ్యాప్తంగా అన్ని యూబీఐ శాఖల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులో ఇచ్చే ఈ స్టాంప్‌ పేపర్‌ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

Read Also: Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేసి పల్లకిలో ఊరేగింపు..

ఈ మేరకు స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో యూ­బీఐ శుక్రవారం అవగాహన ఒప్పందం చేసు­కుంది. స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ రీజనల్‌ మేనేజర్‌ సత్యేంద్రకుమార్‌ తివారీ, యూబీఐ స్టేట్‌ ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ నవనీత్‌ కుమార్‌ల మధ్య విజయవాడలో ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో యూబీఐ ఉన్నతాధికారులు మురళీపార్థసారథి, శారదామూర్తి, పీవీజేఎన్‌ మూర్తి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 120 యూబీఐ బ్రాంచ్‌లలో శనివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని యూబీఐ ఎఫ్‌జీఎం నవనీత్‌ కుమార్‌ తెలిపారు.