Site icon NTV Telugu

Tomato: రైతులను లక్షాధికారులను చేస్తున్న టమాటా పంట.. ఎక్కడంటే ?

Tomato Rates

Tomato Rates

Tomato: దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా టమాటా మోత మోగుతోంది. రోజు రోజుకు వాటి ధర పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.81 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరగడానికి టమాటా కూడా ఒక కారణం. దీంతో సామాన్యుల వంటగదిలో టమాటా మాయమైంది. దీని వల్ల రైతులకు ప్రయోజనం అందడం లేదనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే అలాంటి కొంతమంది రైతుల గురించి తెలుసుకుందాం.

Read Also:Bhopal News: ‘సారీ ఫర్ ఎవర్’అని సెల్ఫీ తీసుకుని.. భార్య, పిల్లలతో ఉరేసుకుని ఆత్మహత్య

ఈ రైతు కుటుంబాలు 1000, 2000 సంపాదించలేదు.. టమాటాలు అమ్మి 38 లక్షల రూపాయలు సంపాదించాయి. ఇదంతా ఎలా జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత నెలలో టమోటా ధరలు 326 శాతం పెరిగాయి. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం కర్ణాటకకు చెందిన ఓ రైతు కుటుంబం టమాటాలు అమ్మడం ద్వారా రూ.38 లక్షలు సంపాదించింది. నిజానికి ఈ రైతు కుటుంబం 2000 టమాట పెట్టెలను విక్రయించింది. దాని నుండి అతనికి పూర్తిగా 38 లక్షల రూపాయలు వచ్చాయి.

Read Also:Odisha Train Accident: నిర్లక్ష్యపు అధికారులపై వేటు.. ఒడిషా రైలు ప్రమాదంలో ఏడు మందిని ఉద్యోగం నుంచి తొలగించిన రైల్వే శాఖ

కర్ణాటకకు చెందిన ఈ రైతు కాకుండా వెంకటరామన్ అనే మరో రైతు ఉన్నాడు. చింతామణి తాలూకాకు చెందిన ఈ రైతు టమాట బాక్సును రూ.2200కి విక్రయించాడు. కోలార్ మండిలో టమాటాలు అమ్మేందుకు వెళ్లగా అతడి వద్ద మొత్తం 54 బాక్సులు ఉన్నాయి. ఒక పెట్టెలో 15 కిలోల టమోటాలు ఉంటాయి. ఈ విధంగా 54 బాక్సులకు గాను 26 బాక్సులను రూ.2200 చొప్పున విక్రయించారు. కాగా మిగిలిన బాక్సులకు రూ.1800 ధర లభించింది. ఇలా 54 బాక్సులను విక్రయించడం ద్వారా 17 లక్షలకు పైగా డబ్బు సంపాదించాడు. పైన పేర్కొన్న ఇద్దరు రైతుల కథ. వీరిద్దరూ కర్ణాటకలోని కోలార్ మార్కెట్‌లో టమోటాలు అమ్ముతూ లక్షాధికారులు అవుతున్నారు. వాస్తవానికి కోలార్ మండిలో టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. ఇక్కడ 15 కిలోల పెట్టె ధర రూ.1900 నుంచి రూ.2200కి పెరిగింది. దీంతో రైతులు బంపర్‌గా ఆర్జిస్తున్నారు.

Exit mobile version