NTV Telugu Site icon

First Ball SIX In T20I: టి20 ఇంటర్నేషనల్‭లో ఆడిన మొదటి బంతినే సిక్సర్ కొట్టిన బ్యాట్స్మెన్స్ వీరే

First Ball Six In T20

First Ball Six In T20

First Ball SIX In T20I: సాధారణంగా ఏ ఒక్క క్రీడాకారుడికైనా తన దేశం తరఫున ఆడడానికి కష్టపడతాడు. అలా దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే అంత ఆషామాష విషయం కాదు. ఎంతోమంది ట్యాలెంటెడ్ ప్లేయర్లను అధిగమించి వారి ట్యాలెంటును నిరూపించుకొని నేషనల్ టీంలో స్థానాన్ని సంపాదించుకుంటారు. అలా స్థానం సంపాదించుకున్న తర్వాత వారు ఆడిన మొదటి గేమునే విజయం తీరాలవైపున నడిపిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటిది మరి భారతదేశం లాంటి దేశాలలో ఎంతో ప్రాముఖ్యం చెందిన క్రికెట్ ఆటలో టీంలో సెలెక్ట్ కావడమే పెద్ద విషయం. అలాంటిది మొదటి బంతికే బాల్ ని సిక్సర్ గా కొడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇదే పనిని ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రికెటర్స్ చేశారు. మరి ఎవరెవరు వారి టి20 ఇంటర్నేషనల్ కెరియర్ లో ఆడిన మొదటి బంతిని సిక్సర్ ను కొట్టారో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్టులో మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు వారు ఆడిన మొదటి బంతికే సిక్స్ ను కొట్టారు. ఈ 8 మంది ఆటగాళ్లలో నలుగురు వెస్టిండీస్ ఆటగాళ్లు ఉండడం కోసమెరుపు.

Read Also: SA vs IND: తిలక్‌ వర్మ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్యకుమార్!

ఇక టి20 ఇంటర్నేషనల్ కెరియర్ లో మొదటి బంతికి సిక్స్ కొట్టిన ఆటగాళ్లలో టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు. 2021 ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడిన మొదటి బంతికే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో సిక్స్ బాది ఈ లిస్టులో చేరాడు. ఇక తాజాగా జరిగిన భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచులో రమన్దీప్ సింగ్ తను ఆడిన మొదటి బంతికే సిక్సర్ కొట్టి లిస్టులో పేరు సంపాదించుకున్నాడు. ఈ లిస్టులో వెస్టిండీస్ ఆటగాడు జెరోమ్ టేలర్ 2008లో తను ఆడిన మొదటి బంతికి సిక్సర్ కొట్టాడు.

Read Also: Tulsi Gabbard: అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా వీర హిందూ మహిళ తులసీ గబ్బర్డ్‌

అలాగే, మరో వెస్టిండీస్ ఆటగాడు జేవియర్ మార్షల్ కూడా 2008లోనే ఈ ఘనతను సాధించాడు. ఇక వెస్టిండీస్ క్రికెట్ లో దిగ్గజ ఆటగాడు కీరన్ పోలార్డ్ కూడా 2008లోనే ఈ ఫీట్ ను సాధించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ మరో ఆటగాడు బెస్ట్ 2013లో ఈ లిస్టులో స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2017లో సౌత్ ఆఫ్రికా ఆటగాడు మంగలీసో మోసెల్ కూడా తాను ఆడిన మొదటి బంతికే సిక్స్ కొట్టాడు. ఇక ఈ లిస్టులో పాకిస్తాన్ ఆటగాడు కూడా ఉన్నాడు. 2007లో టీమిండియాతో తాను ఆడిన మొదటి బంతికే సిక్సర్ గా మలిచి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.