Site icon NTV Telugu

Largest Airports in India: భారత్ లోని టాప్ 10 అతిపెద్ద విమానాశ్రయాలు ఇవే!

Airports

Airports

భారతదేశం విస్తీర్ణం పరంగా పెద్ద దేశం. ఇక్కడ అనేక విమానాశ్రయాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఈ విమానాశ్రయాలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నాయి. ఈ విమానాశ్రయాలన్నింటిలో, కొన్ని విమానాశ్రయాలు స్థానం, కనెక్టివిటీ, నిర్మాణ సౌందర్యం, సేవా నాణ్యత వంటి వాటి ప్రత్యేక లక్షణాలకు ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్ పోర్ట్స్ జాబితాలో మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు టాప్‌లో ఉన్నాయి. మొదటి ఐదు విమానాశ్రయాల్లో నాలుగు స్థానాల్లో ఈ దేశాలకు చెందినవే ఉన్నాయి.

Also Read:YS Jagan Nellore Tour: నేడు నెల్లూరుకు వైఎస్‌ జగన్‌.. ఆంక్షలు, కండిషన్లతో ఉత్కంఠ..

1- మొదటి స్థానంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిలిచింది. 5,500 ఎకరాల్లో విమానాశ్రయం ఉంది.

2. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు,5,106 ఎకరాల విస్తీర్ణంతో రెండో స్థానంలో ఉంది.

3. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 4,008 ఎకరాలతో మూడో స్థానంలో ఉంది.

4. గోవాలోని మోపా వద్ద ఉన్న మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నాలుగో స్థానంలో ఉంది. 2,132 ఎకరాల్లో ఈ విమానాశ్రయం ఉంది.

5. గోవా, పనాజీ విమానాశ్రయం 1,700 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది దేశంలోని అతిపెద్ద విమానాశ్రయాల జాబితాలో ఐదో స్థానంలో ఉంది.

Also Read:Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ మంచి మనసు.. 222 కుటుంబాలకు రగ్గుల పంపిణి!

6. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, 1640 ఎకరాలతో ఆరో స్థానంలో ఉంది.

7.రాంచీలోని బిర్సాముండా ఎయిర్ పోర్ట్, 1560 ఎకరాలతో ఏడో స్థానంలో ఉంది.

8. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది ఎనిమిదో స్థానంలో ఉంది.

9. నాగ్‌పూర్‌లోని డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం 1460 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.తొమ్మిదో స్థానంలో ఈ విమానాశ్రయం ఉంది.

10. పదో స్థానంలో కొచిలోని కొచిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఈ విమానాశ్రయం విస్తీర్ణం 1300 ఎకరాలు.

Exit mobile version