NTV Telugu Site icon

Heroines: సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ వీరే..

Second Innings

Second Innings

సినిమా ఒక రంగుల ప్రపంచం ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలు అనుకుంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.. కేరీర్ మొదట్లో అవకాశాలు లేకపోయినా సెకండ్స్ ఇన్నింగ్స్ లో కొందరు హీరోయిన్లు అదరగొడుతున్నారు.. అలాంటి వారు ఇప్పుడు చాలా మందే ఉన్నారు.. సినిమా కోసం మాత్రమే కాదు తమ వ్యక్తిగత జీవితంలో కూడా వారు ఫిట్నెస్ పై ఫోకస్ చేసిన విధానం వారికి మంచి స్థానాన్ని అందిస్తుంది.. అందులో ముందువరుస ప్రియమణి, జ్యోతిక ఉన్నారు..

ఇద్దరు పెళ్లిళ్లు చేసుకొని మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మళ్లీ సినిమాలు కూడా మొదలుపెట్టి సక్సెస్ అందుకున్నారు.. ఈ ఏడాదిలో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.. జ్యోతిక 2024లో కూడా తన హవా నీ కొనసాగించింది. సైతాన్ అనే పేరుతో హిందీలో కూడా మరో సినిమాలో నటించింది.. ఇప్పుడు హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. మలయాళం లో కూడా బిజీ హీరోయిన్ గా మారింది జ్యోతిక. ఒకవైపు ప్రొడ్యూసర్ గా, మరోవైపు హీరోయిన్ గా నటిస్తూ అన్ని రంగాలలో విజయాలను అందుకుంటూ ఫిట్నెస్ ను మైంటైన్ చేస్తుంది.. ఈమధ్య ఆమె ఫిట్నెస్ కు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

హీరోయిన్ ప్రియమణి కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగోడుతుంది.. భామాకలాపంలో మొట్టమొదట మెయిన్ లీడ్ గా ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేయగా అది మంచి విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ కూడా చేసింది.. ఆ సిరీస్ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆర్టికల్ 370 లో కూడా నటిస్తుంది.. ఇప్పుడు ఆమె చేతిలో ఒక హిందీ, ఒక తమిళ్, ఒక కన్నడ సినిమా కూడా ఉండటం విశేషం.. మరోవైపు బుల్లితెర పై పలు షోలు కూడా చేస్తుంది.. హీరోయిన్స్ గానే కాకుండా సైడ్ క్యారెక్టర్ లో నటిస్తూ దూసుకుపోతున్న తెలుగు హీరోయిన్స్ చాలానే ఉన్నారు.. అందులో భూమిక పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సంగీత,సదా, ఇంద్రజ లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు..