NTV Telugu Site icon

Glenn McGrath: వన్డే వరల్డ్ కప్లో సెమీస్కు చేరుకునే టీమ్లు ఇవే..!

Glen

Glen

భారత్ లో జరిగే.. వన్డే వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ టోర్నీ టైటిల్ కైవసం చేసుకోవడానికి పలు దేశాలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు తమ జట్ల ఆటగాళ్ల ఎంపికలో నిమగ్నమయ్యాయి. వన్డే వరల్డ్ కప్ టోర్నీపై కొంతమంది మాజీ క్రికెట్ నిపుణులు సెమీఫైనల్ చేరే జట్లు ఇవే అంటూ జోష్యం చెబుతున్నారు.

Mr Pregnant Trailer: మగాడు ప్రెగ్నెంట్ అయితే?

తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ సెమీఫైనల్ కు చేరే జట్ల గురించి చెప్పేశాడు. నవంబర్ 15, 16న జరిగే తొలి, రెండో సెమీ ఫైనల్ కి చేరే నాలుగు జట్లు ఏవో తేల్చి చెప్పేశాడు. అందులో భారత్ ఉండగా.. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ కు చేరే అవకాశం ఉందని మెక్ గ్రాత్ పేర్కొన్నాడు. స్వదేశంలో టోర్నీ జరుగుతుంది గనుక.. భారత్ కచ్చితంగా సెమి ఫైనల్ చేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Third INDIA Meet: ‘ఇండియా’ కూటమి తదుపరి సమావేశానికి తేదీ ఫిక్స్.. ఆతిథ్యం ఇవ్వనున్న ఉద్ధవ్

మరోవైపు ఆస్ట్రేలియా జట్టుకు సెమీఫైనల్ కు చేరే సత్తా ఉందని మెక్ గ్రాత్ పేర్కొన్నాడు. ఇకపోతే పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు బాగానే ఆడుతున్నాయని తెలిపాడు. ఇతను ఎంచుకున్న నాలుగు జట్లలో భారత్, పాకిస్తాన్ ఎప్పటినుంచో చిరకాల ప్రత్యర్థులు. మరొకపక్క ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు అంతర్జాతీయ క్రికెట్ తొలినాళ్ల నుంచే చిరకాల ప్రత్యర్థులు. టీమిండియా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 14న పాకిస్తాన్ తో, అక్టోబర్ 29న ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. మెక్ గ్రాత్ చెప్పిందే జరిగిందంటే ప్రత్యర్థుల మధ్య జరిగే పోరు ఎంతో ఉత్కంఠ భరితంగా ఉండనుంది.