Site icon NTV Telugu

Health Tips: బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?.. అయితే ఈ సమస్యలకు ఆహ్వానం పలికినట్టే!

Brush

Brush

నోరు, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవంటున్నారు నిపుణులు. మిల మిల మెరిసే దంతాలు ఉండాలని, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరకుంటారు. ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్ళు మనం సరిగ్గా తినడానికి, మాట్లాడటానికి, ఆత్మవిశ్వాసంతో నవ్వడానికి సహాయపడతాయి. కాగా దంతాలను క్లిన్ చేసుకోవడానికి దాదాపుగా అందరు బ్రష్ లనే యూజ్ చేస్తున్నారు. అయితే బ్రష్ చేసేటపుడు తెలియకుండానే కొన్ని తప్పులు చేయడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. దీనివల్ల దంతాలు, చిగుళ్లు పాడవుతాయి.

Also Read:CM Chandrababu: టీడీపీ కార్యకర్త ఆకుల కృష్ణ మృతికి సీఎం సంతాపం!

కొంతమంది నోటి పరిశుభ్రతకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. తప్పుగా బ్రష్ చేయడం, సరైన టూత్ బ్రష్ ఉపయోగించకపోవడం వల్ల, కావిటీస్ (దంత క్షయం), చిగుళ్ల వ్యాధి, దంత సున్నితత్వం వంటి సమస్యలకు కారణమవుతాయి. ఈ తప్పుల కారణంగా, దంత సమస్యలు పెరుగుతాయి. చాలా మంది తెలియకుండానే పళ్ళు తోముకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. చాలా గట్టిగా బ్రష్ చేయడం వల్ల దంతాలపై పొర (ఎనామెల్) అరిగిపోతుంది. చిగుళ్ళు బలహీనపడతాయి. గట్టి ముళ్ళతో కూడిన బ్రష్ చిగుళ్ళను దెబ్బతీస్తుంది. తొందరపడి బ్రష్ చేస్తే, మీ దంతాలు సరిగ్గా శుభ్రం కావు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయకపోవడం లేదా రాత్రి బ్రష్ చేయకుండా నిద్రపోవడం దంతాలకు హానికరం.

Also Read:Sanjay Dutt: లోకేష్ కనగరాజ్ నన్ను వేస్ట్ చేశాడు!

ఎందుకంటే రాత్రిపూట బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. మీ బ్రష్‌ను 3-4 నెలల కంటే ఎక్కువ కాలం ఉపయోగించవద్దు, ఎందుకంటే పాత బ్రష్‌పై బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇది దుర్వాసన మరియు ఇతర ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఈ తప్పులు దంతాలు, చిగుళ్ళకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. చాలా గట్టిగా బ్రష్ చేయడం వల్ల ఎనామెల్ అరిగిపోతుంది, దంతాలు సున్నితంగా మారతాయి, వేడి లేదా చల్లని ఆహారాలు తినేటప్పుడు నొప్పి వస్తుంది. ఇది మాత్రమే కాదు, చిగుళ్ల వాపు సంభవించవచ్చు. అందుకే బ్రష్ చేసేటపుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే దంతాలకు ఎలాంటి నష్టం వాటిల్లదంటున్నారు నిపుణులు.

Exit mobile version