వక్ఫ్ సవరణ బిల్లుపై శుక్రవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో దుమారం రేగింది. ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన మార్పులను అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వడం లేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై… జాయింట్ కమిటీ కాశ్మీర్ మత గురువు మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అభిప్రాయాలను వినేందుకు సిద్ధమైంది. మిర్వాయిజ్‌ను పిలవడానికి ముందు.. కమిటీ సభ్యులు తమలో తాము చర్చించుకున్నారు. అనంతరం ప్రతిపక్ష నాయకులు సమావేశంలో గందరగోళం సృష్టించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన నివేదికను త్వరగా ఆమోదించాలని బీజేపీ పట్టుబడుతోందని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు.
READ MORE: Puducherry : సోషల్ మీడియాలో అవమానానికి ప్రతీకారం… బాంబుతో స్కూల్ కి వెళ్లిన విద్యార్థి
సమావేశంలో వాడీవేడీ చర్చ జరగడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. మిర్వాయిజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తన సమావేశాన్ని తిరిగి ప్రారంభించింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ, కాంగ్రెస్‌కు చెందిన సయ్యద్ నాసిర్ హుస్సేన్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కమిటీ వ్యవహారాలు ప్రహసనంగా మారాయని వారు అన్నారు. సెక్షన్ల వారీగా ప్రతిపాదించిన సవరణలను పరిశీలించేందుకు జనవరి 27న నిర్వహించనున్న సమావేశాన్ని జనవరి 30 లేదా జనవరి 31వ తేదీకి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ సమావేశంలో ఇప్పటి వరకు పది మంది ప్రతిపక్ష ఎంపీలను జేఏసీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం.
READ MORE: Gottipati Ravi Kumar: చంద్రబాబు కారణంగానే అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో తెలుగు వారు!
కమిటీ ముందు హాజరు కావడానికి ముందు కశ్మీర్‌కి చెందిన వేర్పాటువాది మిర్వాయిజ్ మాట్లాడుతూ.. “వక్ఫ్ సవరణ బిల్లును నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మతపరమైన విషయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని సమర్థిస్తున్నా. మా సూచనలను విని అమలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ముస్లింలకు ద్రోహం చేసేలా చర్యలు తీసుకోవద్దు.” అని పేర్కొన్నారు.