One Toilet in Junior College: ప్రైవేట్ విద్యాసంస్థల్లో కంటే.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోనే మంచి వసతులు ఉంటాయని.. ఆట స్థలాలు.. ఉంటాయని నిత్యం ప్రచారం చేస్తుంటుంది ప్రభుత్వం.. అయితే, ఆ కళశాలలో 150 మంది విద్యార్థులు ఉంటే.. అందులో ఉన్నది మాత్రం ఒక్కటే మరుగుదొడ్డి.. అది కూడా అమ్మాయిలకు, అబ్బాయిలకు కలిపి ఒక్కటే మరుగుదొడ్డి ఉంది.. వింటేనే ఏదోలా ఉన్న విద్యార్థినిలు మాత్రం నరకం అనుభవిస్తున్నారు. ఇది ఒక్క సిద్దిపేట జిల్లా మద్దూర్ ప్రభుత్వ కళాశాల పరిస్థితి కాదు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళశాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి..
Read Also: Uttarpradesh : ఓరయ్యా.. ఏంది రా ఇది.. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు.. నువ్వేమో రీల్స్ చూస్తున్నావ్
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో 150 మంది విద్యార్థులు వున్నారు.. అందులో 90 మంది అమ్మాయిలు, 60 మంది అబ్బాయిలు చదువుకుంటున్నారు.. కానీ, అమ్మాయిలు మూత్రవిసర్జనకు వెళ్లాంటే.. ఒక్కటే మరుగుదొడ్డి ఉంది.. అది కూడా అద్వాన్నంగా ఉన్న తప్పని పరిస్థితుల్లో వాడుకుంటున్నారు.. ఉదయం సమయాన మూత్రవిసర్జనకు వెళ్లాలంటే అమ్మాయిలు జంకుతున్నారు.. క్యూలు కట్టి ఒకరి తరువాత ఒకరం వెళ్తున్నాం.. నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తు్నారు.. ఇక, అమ్మాయిలకే ఇబ్బందిగా ఉండడంతో.. అబ్బాయిలు చేసేది ఏమీలేక ఆరు బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.. అరుబయటకు వెళ్లినప్పుడు పాములు, తేళ్లు వంటి విష కీటకాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు.. గంటల తరబడి మూత్రవిసర్జన ఆపుకోవడంతో విద్యార్థినిలలో మూత్ర సంబంధిత వ్యాధులు బారినపడుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు విద్యారంగనికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు.. ఇప్పటికైనా జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు స్పందించి మద్దూర్ కళాశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు్న్నారు విద్యార్థినులు.
