NTV Telugu Site icon

iPhone 16 : ఐ ఫోన్ 16లో సిమ్ ఉండదు.. ప్రపంచమంతా ‘ఈ-సిమ్’ టెక్నాలజీ..!

New Project (9)

New Project (9)

అమెరికన్ ఫోన్ల తయారీ సంస్థ Apple.. iPhone 16 సిరీస్‌ను 16 సెప్టెంబర్‌లో ప్రారంభించవచ్చ నుంది. ఈ శ్రేణిలోని ప్రో మోడల్‌లలో బెజెల్‌లను సన్నబడవచ్చు. ది స్మార్ట్‌ఫోన్‌ల పరిమాణాన్ని పెంచకుండా పెద్ద స్క్రీన్‌ను అందించడం కంపెనీకి సులభతరం చేస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్‌ రోజ్ గోల్డ్ వేరియంట్ వంటి కొత్త రంగులో ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ 15 సిరీస్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించింది. డిస్‌ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (డిఎస్‌సీసీ) సీఈఓ రాస్ యంగ్, యాపిల్ త్వరలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో డిస్‌ప్లేల తయారీని ప్రారంభిస్తుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “X” ద్వారా గతంలో వెల్లడించారు.

READ MORE: AP Govt: వైఎస్సార్ బీమా పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఫోన్ 16 అమెరికాలో సిమ్ కార్డ్ స్లాట్ లేకుండా లాంచ్ కానుంది. ఎందుకంటే ఆపిల్ గత ఏడాది సిమ్ కార్డ్ స్లాట్ ను తొలగించి యుఎస్ మార్కెట్ కోసం ‘ఈ-సిమ్ ఓన్లీ’ ఐఫోన్ 15 (eSIM only iPhone 15) మోడళ్లను రూపొందించింది. ఇప్పుడు, ఆపిల్ యుఎస్ లో ‘ఈ-సిమ్ ఓన్లీ’ ఐఫోన్ 16 మోడళ్లను కొనసాగిస్తుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా అంతటా ఇదే ‘ఈ-సిమ్ ఓన్లీ’ మోడల్ ను ఆపిల్ లాంచ్ చేస్తుందా? అన్న విషయంలో స్పష్టత లేదు. కొత్త ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రోలను పరిచయం చేస్తూ ఆపిల్ తన తాజా ఆఫర్లను మంగళవారం ఆవిష్కరించింది. ఈ రెండు డివైజెస్ గురించిన ఆసక్తికరమైన వివరాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అవి ప్రత్యేకంగా ‘ఈ-సిమ్’ కు మద్దతు ఇస్తాయి. వాటిలో సాంప్రదాయ సిమ్ కార్డ్ ట్రే ఉండదు. ఈ మార్పు ‘ఈ-సిమ్’ ను విస్తృతం చేయాలన్న ఆపిల్ ఆలోచనను వెల్లడిస్తుంది. అందువల్ల, ఐఫోన్ 16లలో సిమ్ కార్ట్ ట్రే ఉండకపోవచ్చని, ఈ మార్పును ఒక్క యూఎస్ కే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ పరిచయం చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

READ MORE: NEET: “హై-లెవల్ కమిటీ ఏర్పాటు, దోషుల్ని వదిలేది లేదు”.. పేపర్ లీక్‌‌లపై కేంద్రమంత్రి..

తాజాగా ఆపిల్ విడుదల చేసిన 2024 ఐప్యాడ్ మోడళ్లైన ఎం 2 ఐప్యాడ్ ఎయిర్, ఎం 4 ఐప్యాడ్ ప్రో సెల్యులార్ వెర్షన్లలో సిమ్ కార్డ్ ట్రే ను తొలగించారు. వాటిలో ‘ఈ-సిమ్’ ఫెసిలిటీ మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని ఆపిల్ తన వెబ్ సైట్ లో అధికారికంగా ధృవీకరించింది. అమెరికాలో ఆపిల్ 2022 నుంచే అన్ని ఐఫోన్ మోడళ్ల నుండి సిమ్ ట్రేను తొలగించింది. దాంతో, యుఎస్ లోని వినియోగదారులు ‘ఈ-సిమ్ ఓన్లీ’ ఐఫోన్ లకు అలవాటు పడ్డారు. ఇతర దేశాలలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇతర దేశాలలో కొనుగోలు చేసిన ఐఫోన్లలో ఇప్పటికీ సిమ్ కార్డ్ ట్రే ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో మాత్రమే ‘ఈ-సిమ్’ టెక్నాలజీని వాడుతున్నారు.