తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు శనివారం సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఉదయం మణికొండలోని ఆయన నివాసంతో పాటు తాండూరులోని ఆయన సోదరుడి ఇంటిలో తనిఖీలు చేశారు. దాదాపు ఐదు చోట్ల ఏకకాలంలో రెయిడ్ చేశారు. ఈ క్రమంలో తాండూర్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ దాడులకు రోహిత్ రెడ్డి భయపడేది లేదని తెలిపారు. నిన్న హైదరాబాద్ లోని తన మిత్రులు, వ్యాపారాలకు సంబంధించి 14 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయని అన్నారు. ఐటీ దాడుల్లో ఏమీ లభించలేదు.. ఇటువంటి కుట్రలు ఎన్నో ఎదుర్కొన్నట్లు చెప్పారు. రోహిత్ రెడ్డిని మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Read Also: L2E Empuraan: లూసిఫర్ సీక్వెల్ కోసం పాక్ భామ
కాంగ్రెస్ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని రోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా.. కలిసి తాండూర్ ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల పై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోయారు.. ఎన్నడు లేని మెజార్టీతో బీఆర్ఎస్ తాండూర్ లో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా కోర్టులో మూడో తేదీన వారికి శిక్ష పడడం ఖాయమని రోహిత్ రెడ్డి పేర్కొ్న్నారు.
Read Also: Allu Arjun: బోయపాటికి బన్నీ ‘షరతులు వర్తిస్తాయి’!