నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ది పారడైస్. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి అభిమానులకు మరో స్పెషల్ అప్‌డేట్ రాబోతోంది. ది పారడైస్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాటను నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న విడుదల చేసేలా ప్లాన్ చేస్తోంది.
Also Read : Dhurandhar : రణవీర్ సింగ్ రూత్ లెస్ యాక్షన్ ‘ ధురంధర్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌తో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. టైటిల్ గ్లింప్స్ మరియు పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన నేపథ్యంలో, ఇప్పుడు పాట ద్వారా సినిమా మూడ్‌ను పరిచయం చేయనున్నారు. నాని పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసేలా ఈ సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. ప్రతి ఏడాది నాని బర్త్‌డే సందర్భంగా ఏదో ఒక స్పెషల్ కంటెంట్ రిలీజ్ అవుతుండగా, ఈసారి ది పారడైస్ ఫస్ట్ సింగిల్ ఆయన అభిమానులకు పెద్ద ట్రీట్‌గా మారనుంది.త్వరలోనే ఈ పాటకు సంబంధించిన రిలీజ్ టైమ్ మరియు ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ది పారడైస్ ఫస్ట్ సింగిల్‌తో సినిమా హైప్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతుంది.
