808Krishna : 19 ఏళ్ల మ్యూజిక్ సెన్సేషన్.. టాలీవుడ్ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ చిత్ర పరిశ్రమలో ‘808Krshna‘ గా సుపరిచితుడైన తేజస్ కృష్ణ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న Thalaivar173 కి తేజస్ కృష్ణ అందించిన టైటిల్ స్కోర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేకాకుండా ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్‌తో కలిసి పలు చిత్రాలకు పనిచేసి మెయిన్ స్ట్రీమ్ మరియు ఎక్స్‌పెరిమెంటల్ సంగీతంలో తన ప్రతిభ చాటుకున్నాడుతేజస్.
తేజస్ కేవలం సినిమా సంగీతానికే పరిమితం కాకుండా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్నారు. తేజస్ విడుదల చేసిన ‘పాత ఎడత్తిల‘ అనే ఇండిపెండెంట్ ట్రాక్ సంగీత ప్రియులను విశేషంగా అలరించింది. 4 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ యువ సంచలనం ఇప్పటికే యూనివర్సల్ మ్యూజిక్, థింక్ మ్యూజిక్ వంటి దిగ్గజ సంస్థల ద్వారా తన పాటలను విడుదల చేశారు. కాగా ఇప్పడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు యువ సంగీత దర్శకుడు తేజస్ కృష్ణ. ప్రస్తుతం విష్వక్ సేన్ హీరోగా, రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్నఓ సినిమా సోమవారం నాడు పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తేజస్ కృష్ణ వర్క్ చేస్తున్నాడు. తేజస్ సంగీత శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఆఫ్రో రిథమ్స్, హిప్-హాప్, జాజ్ టెక్స్చర్స్ మరియు భారతీయ శాస్త్రీయ సంగీత అంశాలను మిక్స్ చేసి నేటి తరం మ్యూజిక్ లవర్స్ ను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. భావోద్వేగపూరితమైన ట్యూన్స్‌తో తెలుగు మరియు భారతీయ సంగీత రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్న తేజస్ కృష్ణ, రాబోయే రోజుల్లో స్టార్ కంపోజర్‌గా ఎదుగుతారనడంలో సందేహం లేదు. ప్యూర్ ప్రేమ కథగా వస్తున్న విశ్వక్ సినిమాకు తేజస్ ఎలాంటి సాంగ్స్ ఇస్తాడో లెట్స్ వెయిట్.
Also Read
- Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
తాజావార్తలు
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!