NTV Telugu Site icon

Nisith Pramanik : మంత్రి వర్గంలో చిన్నవాడు.. కానీ దొంగతనంలో పెద్దవాడు

Nisith Pramanik

Nisith Pramanik

Nisith Pramanik : ఆయనో కేంద్రమంత్రి కానీ దొంగతనం కేసులో నేడు కోర్టుకు హాజరయ్యాడు. కోర్టు అతడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడ ఇదే విషయం చర్చనీయాంశమైంది. కేంద్రమంత్రి ఏంటి దొంగతనం చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అవునండి.. కానీ ఆ మంత్రికి కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది తాజా కేసులోది కాదు 13ఏళ్ల క్రితం కిందది. వివరాల్లోకి వెళితే.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రామాణిక్ 2009వ సంవత్సరం నాటి దొంగతనం కేసులో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న నిషిత్ ప్రామాణిక్ నిందితుడిగా ఉన్నాడు.

Read Also: KCR Congratulates Nikhat Zareen: నిఖత్ జరీన్‌ కు అర్జున అవార్డు.. అభినందించిన కేసీఆర్

పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో 13 ఏళ్ల క్రితం రెండు నగల దుకాణాల్లో చోరీలకు సంబంధించి నిషిత్ ప్రమాణిక్‌పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సుదీర్ఘ కాలంగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. గత కొన్నాళ్లుగా నిషిత్ తరపున ఆయన న్యాయవాది కోర్టుకు హాజరవుతున్నారు. అయితే ఇటీవల ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో కేంద్ర మంత్రి నిషిత్ ప్రామాణిక్ కి కోర్టు అరెస్టు వాలని జారీ చేసింది. వెంటనే అరెస్టు చేసి అతడిని కోర్టు ముందు ప్రవేశ పెట్టాలంటూ న్యాయమూర్తులు పోలీసులను ఆదేశించారు. మంత్రితో పాటు మరో నిందితుడిపై కూడా నవంబర్ 11న అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే, నిషిత్ ప్రమాణిక్ న్యాయవాది దులాల్ ఘోష్ వారి తదుపరి చట్టపరమైన చర్యను వెల్లడించలేదు. 2009లో అలీపుర్‌దూర్‌ రైల్వే స్టేషన్‌, బీర్‌పారా సమీపంలోని నగల దుకాణాల్లో చోరీ ఘటనలు జరిగాయి.

Read Also: 15 New Fire Stations: రాష్ట్రంలో 15 అగ్నిమాపక కేంద్రాలు.. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం

కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు నుంచి అలీపుర్‌దూర్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జహర్ మజుందార్ బుధవారం పీటీఐకి తెలిపారు. కాగా, నిషిత్ ప్రమాణిక్ ఉత్తర బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న దిన్హటా పట్టణంలో నివాసి. 2019 సంవత్సరంలో బిజెపిలో చేరిన నిషిత్ ప్రామాణిక్ ఆ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నాడు. మోడీ మంత్రి వర్గంలో ఉన్న మంత్రుల్లో అత్యంత చిన్న వయసు మంత్రిగా కూడా నిషిత్ ప్రామాణిక్‌ ఉన్నారు.