NTV Telugu Site icon

Viral Video: థియేటర్‌ యాజమాన్యం నిర్వాకం.. టికెట్‌ ఉందని ప్రాధేయపడినా.. వీడియో వైరల్

Theatre

Theatre

Viral Video: ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినా, రాకెట్లతో అంతరిక్షాన్ని చుట్టి వస్తున్నా దేశంలో అక్కడక్కడ జాతివివక్షలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. దానికి తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ఓ సంచార జాతికి చెందిన మహిళ తన పిల్లలతో కలిసి సినిమా చూద్దామని థియేటర్‌కు వెళ్లింది. తన దగ్గర ఉన్న డబ్బులతో టికెట్లు తీసుకుని లోపలికి వెళ్తుండగా సిబ్బంది వారిని లోపలికి వెళ్లకుండా నిలిపివేశారు. దానికి కారణం వారు సంచార జాతిలో పుట్టిన వారు కావడమే. చెన్నైలో థియేటర్ యాజమాన్యం నిర్వాకం చూసిన నెటిజన్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Mayor of Ballari: 23 ఏళ్లకే మేయర్ పదవి.. చరిత్ర సృష్టించిన త్రివేణి

ఇవాళ ప్రముఖ హీరో శింబు నటించిన ‘పత్తు తల’ సినిమా విడుదల అయింది. చెన్నైలోని రోహిణి థియేటర్‌లో సంచార జాతికి చెందిన వారిని సిబ్బంది అనుమతించలేదు. టికెట్టు ఉంది అనుమతించాలని ప్రాధేయపడినా నిర్వాహకులు కనికరించలేదు. తోటి ప్రేక్షకులు చెప్పినా వినకుండా సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. తమకు ఇష్టమైన హీరో సినిమా చూడడానికి వచ్చిన వారి జాతి వివక్ష పేరుతో ఇలా వెళ్లగొట్టడంపై పలువురు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.