Site icon NTV Telugu

Sundeep Kishan : ‘ఊరు పేరు భైరవ కోన’ స్పెషల్‌ ప్రీమియర్స్ పై అప్‌డేట్‌ ఇచ్చిన యంగ్ హీరో..

Whatsapp Image 2024 02 07 At 11.18.40 Pm

Whatsapp Image 2024 02 07 At 11.18.40 Pm

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఊరు పేరు భైరవ కోన . ఫాంటసీ డ్రామా నేపథ్యం లో వస్తోన్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్ల లో గ్రాండ్‌ గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యం లో ఊరు పేరు భైరవకోన మేకర్స్‌ పెయిడ్‌ ప్రీమియర్ అప్‌డేట్ ను అందించారు.అడ్వాన్స్‌గా రెండు రోజులపాటు పెయిడ్‌ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఈ స్పెషల్ షో లు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఎంపిక చేయబడ్డ పట్టణాల్లో అందుబాటులో ఉండనున్నాయి. మేకర్స్ ఈ సినిమా సక్సెస్‌ పట్ల  కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు.ఈ చిత్రాన్ని హాస్య మూవీస్‌ బ్యానర్‌ పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు.

గతం లో శ్రీవిష్ణు హీరోగా నటించిన సామజవరగమన చిత్రానికి రెండు రోజులు ప్రీమియర్స్ వేయగా.. సూపర్ హిట్‌గా నిలిచింది. మరి సందీప్‌ కిషన్‌ సినిమా కూడా ఇదే రేంజ్‌లో సక్సెస్‌ అందుకుంటుందా అనేది చూడాలి.అయితే విడుదల కు ముందే ఫస్ట్ సింగిల్‌ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్‌ నెట్టింట మిలయన్ల సంఖ్య లో వ్యూస్‌ సాధించి టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ.. మ్యూజిక్ లవర్స్‌ మనసు దోచేస్తోంది. ఈ ఒక్క సాంగ్‌ సినిమా పై సూపర్ హైప్ క్రియేట్‌ చేస్తోంది. అలాగే మరోవైపు రెండో సింగిల్‌ హమ్మ హమ్మ సాంగ్‌  మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా తెరకెక్కిస్తున్నారు. టైగర్‌ మూవీ తర్వాత సందీప్‌ కిషన్‌, వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సారి ఇంట్రెస్టింగ్ టైటిల్‌ తో వస్తున్న వీఐ ఆనంద్‌ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్‌ చేస్తాడో చూడాలి.

Exit mobile version