Lottery: జాక్ పాట్.. లాటరీలో రూ.13వేల కోట్లు గెలుచుకున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వ్యక్తికి రాత్రికి రాత్రే కోటిశ్వరుడు అయ్యాడు.. అదృష్టం అలా అతడికి కలిసి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన వ్యక్తి మెగా మిలియన్స్ లాటరీ టికెట్ తగలడంతో బిలియనీర్ అయ్యాడు. ఆ వ్యక్తి ఏకంగా 13 వేల కోట్ల రూపాయిలను గెలుచుకున్నాడు. అయితే, అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్‌లో నివసిస్తున్న వ్యక్తికి 1.58 బిలియన్ల లాటరీ వచ్చింది. దీని విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు 13 వేల 082 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నగదును లాటరీ ద్వారా గిఫ్ట్ గా గెలుచుకున్నాడు. ఇది లాటరీ చరిత్రలో అతి పెద్ద జాక్ పాట్ గా చెప్పొచ్చు. అతడి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు.
Read Also: Astrology: ఆగస్టు 10, గురువారం దినఫలాలు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీని గెలుచుకున్నట్లు నిర్వహకులు తెలిపారు. మెగా మిలియన్ జాక్ పాట్ లో అతడికి రూ.13 వేల కోట్లు తగిలిందని వారు పేర్కొన్నారు. జాక్ పాట్ తీసిన డ్రాలో పవర్‌బాల్ గేమ్ కింద 13, 19, 20, 32, 33, 14 నంబర్లు ఉన్నాయి.. ఇందులో గోల్డ్ మెగా బాల్ నంబర్ 14 కూడా ఉంది. అయితే, అతడికి వచ్చే రూ. 13 వేల కోట్లలో అన్ని ట్యాక్స్ లు పోనూ.. కేవలం 6 వేల 269 కోట్ల రూపాయిలు మాత్రమే వస్తాయి. మెగా మిలియన్స్ లాటరీ టికెట్ ను 2 డాలర్లతో ( ఇండియన్ కరెన్సీలో రూ. 165) కొనుగోలు చేశాడు.
Read Also: World Cup 2023 Schedule: వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు.. టీమిండియా షెడ్యూల్ ఇదే!
అయితే ఇందులో గెలిచే అవకాశాలు చాలా తక్కువుగా ఉంటాయి. 30 కోట్ల మంది ఈ లాటరీ టికెట్ ను కొనుగోలు చేస్తే ఒకరు మాత్రమే గెలుచుకోగలరు. నలభై ఏళ్లుగా లాటరీ అమ్మకాలు జరుపుతున్న మెగా మిలియన్స్ జాక్ పాట్.. 2023 ఏడాదిలో తొలి లాటరీ నిర్వహించింది. అందులో ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. గెలిచిన వ్యక్తికి మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు 30 వాయిదాల్లో చెల్లించనున్నారు. అలా కాకుండా.. మొత్తం ఒకేసారి కావాలంటే లాటరీ మొత్తాన్ని తగ్గించి సుమారు రూ.5వేల కోట్లు ఇస్తారు. అందులో అతడు ఫెడరల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి 24 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అతడు ఏ రాష్ట్రంలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడో.. అక్కడి నిబంధనల ప్రకారం స్టేట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!