NTV Telugu Site icon

Lottery: జాక్ పాట్.. లాటరీలో రూ.13వేల కోట్లు గెలుచుకున్నాడు..

Loterry

Loterry

ఓ వ్యక్తికి రాత్రికి రాత్రే కోటిశ్వరుడు అయ్యాడు.. అదృష్టం అలా అతడికి కలిసి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన వ్యక్తి మెగా మిలియన్స్ లాటరీ టికెట్ తగలడంతో బిలియనీర్ అయ్యాడు. ఆ వ్యక్తి ఏకంగా 13 వేల కోట్ల రూపాయిలను గెలుచుకున్నాడు. అయితే, అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్‌లో నివసిస్తున్న వ్యక్తికి 1.58 బిలియన్ల లాటరీ వచ్చింది. దీని విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు 13 వేల 082 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నగదును లాటరీ ద్వారా గిఫ్ట్ గా గెలుచుకున్నాడు. ఇది లాటరీ చరిత్రలో అతి పెద్ద జాక్ పాట్ గా చెప్పొచ్చు. అతడి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు.

Read Also: Astrology: ఆగస్టు 10, గురువారం దినఫలాలు

ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీని గెలుచుకున్నట్లు నిర్వహకులు తెలిపారు. మెగా మిలియన్​ జాక్​ పాట్ ​లో అతడికి రూ.13 వేల కోట్లు తగిలిందని వారు పేర్కొన్నారు. జాక్ పాట్ తీసిన డ్రాలో పవర్‌బాల్ గేమ్ కింద 13, 19, 20, 32, 33, 14 నంబర్లు ఉన్నాయి.. ఇందులో గోల్డ్ మెగా బాల్ నంబర్ 14 కూడా ఉంది. అయితే, అతడికి వచ్చే రూ. 13 వేల కోట్లలో అన్ని ట్యాక్స్ లు పోనూ.. కేవలం 6 వేల 269 కోట్ల రూపాయిలు మాత్రమే వస్తాయి. మెగా మిలియన్స్ లాటరీ టికెట్ ను 2 డాలర్లతో ( ఇండియన్ కరెన్సీలో రూ. 165) కొనుగోలు చేశాడు.

Read Also: World Cup 2023 Schedule: వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు.. టీమిండియా షెడ్యూల్‌ ఇదే!

అయితే ఇందులో గెలిచే అవకాశాలు చాలా తక్కువుగా ఉంటాయి. 30 కోట్ల మంది ఈ లాటరీ టికెట్ ను కొనుగోలు చేస్తే ఒకరు మాత్రమే గెలుచుకోగలరు. నలభై ఏళ్లుగా లాటరీ అమ్మకాలు జరుపుతున్న మెగా మిలియన్స్​ జాక్ పాట్.. 2023 ఏడాదిలో తొలి లాటరీ నిర్వహించింది. అందులో ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. గెలిచిన వ్యక్తికి మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు 30 వాయిదాల్లో చెల్లించనున్నారు. అలా కాకుండా.. మొత్తం ఒకేసారి కావాలంటే లాటరీ మొత్తాన్ని తగ్గించి సుమారు రూ.5వేల కోట్లు ఇస్తారు. అందులో అతడు ఫెడరల్​​ ట్యాక్స్​ కింద కేంద్ర ప్రభుత్వానికి 24 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అతడు ఏ రాష్ట్రంలో లాటరీ టికెట్​ కొనుగోలు చేశాడో.. అక్కడి నిబంధనల ప్రకారం స్టేట్ ట్యాక్స్​ కట్టాల్సి ఉంటుంది.

Show comments