NTV Telugu Site icon

Russia-Ukraine War: 500 రోజులుగా కొనసాగుతున్న రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం..!

Russia Ukraine War

Russia Ukraine War

రెండు రోజుల్లో ముగుస్తుందనుకున్న రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం500 రోజులుగా కొనసాగుతుంది. 2022ను యుద్ధనామసంవత్సరంగా మారింది.. 2022, ఫిబ్రవరి 24న రష్యా- ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం ప్రారంభమయినప్పుడు ఇన్ని రోజుల పాటు కొనసాగుతుందని ఎవరు అనుకోలేదు. నాలుగైదు రోజుల్లో యుద్ధం ముగిసిపోతుందని అందరు అనుకున్నారు. అసలు యుద్ధం లక్ష్యమేంటో తెలియనప్పటికీ నెలరోజులలోపు ఉక్రెయిన్‌ను రష్యా స్వాధీనం చేసుకుంటుందని అందరు అంచనా వేశారు. కానీ పరిస్థితులు తలకిందులయ్యాయి. స్పెషల్ మిలటరీ ఆపరేషన్ సుదీర్ఘయుద్ధంగా కొనసాగుతుంది. నిరంతరాయంగా కొనసాగుతున్న.. ఈ యుద్ధం ఇంకా ఎన్నాళ్లుంటుందో.. ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Read Also: SS Thaman: కావాలని ఫ్లాప్ సినిమాలు చేస్తారా? ‘గుంటూరు కారం’పై స్పందించిన థమన్

నాటోకూటమిలో చేరాలన్న ఉక్రెయిన్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా రష్యా యుద్ధం మొదలు పెట్టింది. అంతులేని యుద్ధంలో ఫలితం తేలనట్టే.. ఉక్రెయిన్ నాటో చేరిక వ్యవహారంలోనూ ఎలాంటి పురోగతి లేదు.. కానీ యుద్ధం ఇటు ఉక్రెయిన్‌కు, అటు రష్యాకు తీవ్ర నష్టం మాత్రం మిగిల్చింది. ఉక్రెయిన్ దేశం ఇప్పటికే శిథిలావస్థకు చేరింది. పునర్‌నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు. దేశం మొత్తం అస్థవ్యస్థమయింది. మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉపాధి అవకాశాలు పోయింది. 63 లక్షల మంది వలసపోయారు. దేశంలో మిగిలిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

Read Also: Chiranjeevi and Pawan Kalyan: చిరంజీవి, పవన్‌పై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. మెగాస్టార్‌ అప్పుడే చెప్పాడు..

ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజలకు భవిష్యత్ గురించి నమ్మకం, ఆశ లేవు, అసలు రోజు గడుస్తుందన్న భరోసానే లేదు. మొత్తంగా ఉక్రెయిన్ దేశం కోలుకోలేని స్థాయిలో దెబ్బతింది. అయితే.. అటు రష్యా పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీలేదు.. ఉక్రెయిన్‌లా మొత్తం రష్యాలో ప్రత్యక్ష విధ్వంసం జరగడం లేదు కానీ.. యుద్ధభారంతో రష్యా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. సాధారణ సైనికుల సంఖ్య సరిపోక.. సైన్యం రిక్రూట్‌మెంట్ నిత్యకృత్యంలా కొనసాగుతుంది. సాధారణ ప్రజలు, చివరకు జైల్లోని ఖైదీలు సైతం యుద్ధంలో సైనికులుగా పనిచేస్తున్నారు.

Read Also: Sweet Corn Pakora : మొక్కజొన్న పకోడీలను ఇలా చేస్తే చాలు.. టేస్ట్ అదిరిపోతుంది అంతే..

500 రోజుల యుద్ధంలో ఎంతమంది చనిపోయారనేది ఏ దేశమూ ఇప్పటి వరకు అధికారికంగా తెలుపలేదు.. కానీ 500 మంది పిల్లలు సహా 9 వేలమంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి పేర్కొనింది. ఈ ఏడాది చనిపోయిన వారి సంఖ్య 2022తో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ.. మే, జూన్‌లో మళ్లీ మృతుల సంఖ్య పెరగింది. పదహారున్నర నెలల పాటు కొనసాగుతున్న యుద్ధంలో తూర్పు ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యా హస్తగతం చేసుకుంది. ఇటు ఉక్రెయిన్, అటు రష్యా అధ్యక్షులు, ప్రజలు యుద్ధం కారణంగా దినదినగండంగానే గడుపుతున్నారు. అంతర్జాతీయ సమాజం ఎలాగూ ఈ యుద్ధాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి.. రష్యా-ఉక్రెయిన్ స్వచ్ఛందంగానే యుద్ధాన్ని విరమించుకోవడం ఒక్కటే మార్గం.